April 12, 2026 1:51 am

V1News Telangana

PDS బియ్యం అక్రమ రవాణాపై CCS మెరుపుదాడి – 450 క్వింటాళ్లు స్వాధీనం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు కీలక చర్యలు చేపట్టారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS గారి ఆదేశాల మేరకు CCS ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ వాలి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ రోజు మెరుపు దాడులు నిర్వహించింది.
బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగిడేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర బిన్నీ రైస్ మిల్‌లో తనిఖీలు చేపట్టగా, సుమారు 450 క్వింటాళ్ల PDS బియ్యంను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అదే సమయంలో, ఈ అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న **TATA Ape ఆటో (నెంబర్: TS16T 0397)**ను కూడా పోలీసులు సీజ్ చేశారు.
స్వాధీనం చేసిన బియ్యం మరియు వాహనాన్ని తదుపరి చర్యల నిమిత్తం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more