పేకాట & పిడిఎస్ రైస్ అక్రమాలపై పోలీసుల దాడులు – పలువురు అదుపులోకి నిజామాబాద్ సిసిఎస్ దాడులు: నగదు, బియ్యం, వాహనం స్వాధీనం
నిజామాబాద్, ఏప్రిల్ 8 (ప్రతినిధి):
నిజామాబాద్ జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై సిసిఎస్ (CCS) పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు, సిసిఎస్ ఇన్‌చార్జ్ ఏసీపీ శ్రీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో జరిగాయి.
🔹 పేకాట స్థావరం పై దాడి
ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ARP క్యాంప్ వద్ద నిర్వహించిన దాడిలో 2 మంది పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మరో 4 మంది పరారీలో ఉన్నారు. వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు మరియు రూ.30,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యల కోసం ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
🔹 పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా
బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోట్ల పిడిఎస్ బియ్యం అక్రమ నిల్వలు, రవాణాపై దాడులు నిర్వహించారు.
ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద 40 బస్తాల పిడిఎస్ బియ్యం (అంచనా విలువ రూ.45,000) స్వాధీనం
పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో 55 బస్తాల బియ్యం (అంచనా విలువ రూ.55,000) స్వాధీనం
అదే ప్రాంతంలో టాటా ఏప్ వాహనంలో తరలిస్తున్న 150 కిలోల బియ్యం (అంచనా విలువ రూ.5,000) స్వాధీనం
స్వాధీనం చేసిన బియ్యం..
మరియు వాహనాన్ని బోధన్ పోలీస్ స్టేషన్ SHOకు అప్పగించారు.
🔹 పోలీసుల హెచ్చరిక
జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. పేకాట, పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832