April 12, 2026 1:50 am

V1News Telangana

నిజామాబాద్‌లో భారీ సైబర్ మోసం బట్టబయలు – ₹152 కోట్ల లావాదేవీలు, 9 మంది అరెస్ట్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్, ఏప్రిల్ 8:
నిజామాబాద్ జిల్లాలో విస్తృత స్థాయిలో జరుగుతున్న సైబర్ మోసాలపై పోలీసులు కీలక చర్యలు చేపట్టి భారీ మోసం రహస్యాన్ని బట్టబయలు చేశారు. ఈ కేసులో భాగంగా 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS పర్యవేక్షణలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. IV టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో, సైబర్ క్రైమ్ సిబ్బంది సహకారంతో ఈ ఆపరేషన్ విజయవంతమైంది.
దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. నిందితులు నకిలీ ధ్రువపత్రాలను ఉపయోగించి బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేసి, వాటిని మధ్యవర్తుల ద్వారా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. ఈ అకౌంట్లను ఆన్‌లైన్ మోసాలకు వినియోగించినట్లు గుర్తించారు.
మాత్రం మూడు నెలల వ్యవధిలో ఈ అకౌంట్ల ద్వారా సుమారు ₹152 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గతంలో 7 మందిని అరెస్ట్ చేయగా, తాజా చర్యల్లో మరో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అన్ని నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు పంపించారు.
ఇక బ్యాంక్ అధికారులు కస్టమర్ సమర్పించిన పత్రాలను సరైన విధంగా ధృవీకరించకుండానే ఖాతాలు ప్రారంభించిన అంశంపై కూడా విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
🔺 ప్రజలకు పోలీసుల సూచనలు:
మీ బ్యాంక్ ఖాతాలను ఇతరులకు ఇవ్వకండి, అమ్మకండి
OTP, PIN, CVV వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోకండి
అనుమానాస్పద కాల్స్, లింక్స్, మెసేజెస్‌పై నమ్మకం పెట్టుకోకండి
త్వరగా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే ఆఫర్లను నమ్మవద్దు
సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి
లేదా www.cybercrime.gov.in⁠� లో ఫిర్యాదు నమోదు చేయండి
సైబర్ నేరాల నియంత్రణలో ప్రజల అప్రమత్తత కీలకమని పోలీసులు సూచించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more