Breaking News
అడవుల్లో మళ్లీ పేకాట దందా..!మోస్ర, బోధన్ మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా జూదం… बिलोली खरेदी-विक्री संघ निवडणुकीत खतगावकर गटाचे यश; भाजपच्या ठक्करवाड गटाला मोठा धक्का! దూసుకుపోతున్న ఇసుక మాఫియా.. సాలూరలో అధికారుల కళ్లముందే అక్రమ రవాణా?” “అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇసుక దందా.. ఎవరి ఆశీస్సులతో?” “చెక్‌పోస్ట్ ఉన్నా ప్రయోజనం లేదు.. సాలూరలో యథేచ్ఛగా ఇసుక తరలింపు” “రాత్రివేళ ట్రాక్టర్లు, బొలెరోలతో ఇసుక దోపిడి.. ప్రభుత్వానికి భారీ నష్టం” गंजगाव मध्ये इफ्तार पार्टी ’मुळे हिंदू-मुस्लिम समाजा मध्ये एकोपा రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలి “ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్ లేదు” – బోధన్ కళాశాలల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం . పరీక్షల వేళ ఫీజుల వసూళ్ల దందా?

V1News Telangana

best news portal development company in india

అడవుల్లో మళ్లీ పేకాట దందా..!మోస్ర, బోధన్ మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా జూదం…

SHARE:

మధ్యాహ్నం నుంచే పెద్ద మొత్తాల్లో పేకాట
పోలీసుల చర్యలపై గ్రామస్థుల ప్రశ్నలు…

నిజామాబాద్ జిల్లా మోస్ర మరియు బోధన్ మండలాల్లో పేకాట దందా మళ్లీ జోరందుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోస్ర మండలంలోని కొత్తపేట గ్రామ పరిసర అడవుల్లోని గుట్టల వద్ద, అలాగే బోధన్ మండలంలోని ఉప్పల్లిపల్లి గ్రామ పంట శివారులో రహస్యంగా పేకాట స్థావరాలు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ జూదం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని పెద్ద మొత్తాల్లో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారని గ్రామస్థులు అంటున్నారు. అడవులు, పంట శివారులను కేంద్రంగా చేసుకుని ఈ దందా సాగుతుండటం గమనార్హం.
ఇలా అక్రమంగా పేకాట నిర్వహణ కొనసాగుతుండటంతో స్థానికంగా శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యువత జూదానికి అలవాటు పడే ప్రమాదం ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
అధికారుల దృష్టికి ఈ విషయం పలుమార్లు తీసుకెళ్లినా ఇంకా కఠిన చర్యలు కనిపించడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులు స్పందించి పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి ఈ దందాను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india
best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई

దూసుకుపోతున్న ఇసుక మాఫియా.. సాలూరలో అధికారుల కళ్లముందే అక్రమ రవాణా?” “అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇసుక దందా.. ఎవరి ఆశీస్సులతో?” “చెక్‌పోస్ట్ ఉన్నా ప్రయోజనం లేదు.. సాలూరలో యథేచ్ఛగా ఇసుక తరలింపు” “రాత్రివేళ ట్రాక్టర్లు, బొలెరోలతో ఇసుక దోపిడి.. ప్రభుత్వానికి భారీ నష్టం”