. “ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్ లేదు” – బోధన్ కళాశాలల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం
. పరీక్షల వేళ ఫీజుల వసూళ్ల దందా? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా!
. ధోబీ ఫీజు పేరుతో దోపిడి? హాల్ టికెట్లపై షరతులు విధిస్తున్న కళాశాలలు.
బోధన్ పట్టణంలోని కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో పరీక్షల సమయం రాగానే ఫీజుల పేరుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పరేషాన్ చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఫీజులు పూర్తిగా చెల్లించకపోతే హాల్ టికెట్ ఇవ్వబోమని, పరీక్షలకు అనుమతించబోమని ముక్కుసూటిగా హెచ్చరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హాజరు తక్కువగా ఉందని, బకాయిలు ఉన్నాయని చూపిస్తూ చివరి నిమిషంలో ఒత్తిడి తీసుకురావడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమేనని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. హాస్టల్‌లో ఉండని రెగ్యులర్ విద్యార్థులకూ “ధోబీ ఫీజు” వసూలు చేయడం ఏ నిబంధనలో ఉందని ప్రశ్నల వర్షం కురుస్తోంది.
ఒక విద్యార్థి విషయంలో, ప్రతిరోజూ కళాశాలకు హాజరవుతున్నప్పటికీ ధోబీ ఫీజు విధించడంపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయగా యాజమాన్యంతో వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. “ఫీజులు కట్టితేనే హాల్ టికెట్” అనే కఠిన వైఖరి వల్ల కొందరు తల్లిదండ్రులు అప్పు తెచ్చి అయినా డబ్బులు చెల్లించి హాల్ టికెట్లు తీసుకున్న పరిస్థితి నెలకొంది.
పరీక్షల సమయం అంటే విద్యార్థులకు అత్యంత కీలక దశ. అటువంటి సమయంలో ఫీజుల పేరుతో ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? విద్యా సంస్థలు వ్యాపార సంస్థలా వ్యవహరిస్తున్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణమే దృష్టి సారించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పరిస్థితి ఆందోళనకర దిశగా వెళ్లే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







