Post Views: 44
సాలూర మండల కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ శశిబూషణ్ ఆధ్వర్యంలో ZPHS పాఠశాల నుండి బస్టాండ్ వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించగా, విద్యార్థులతో ఓటు ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకుని ప్రజాస్వామ్యంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన ఒక సీనియర్ ఓటర్ను, కొత్తగా నమోదు చేసుకున్న ఒక నూతన ఓటర్ను సన్మానించారు.
కార్యక్రమంలో సాలూర సర్పంచ్ లావణ్య, మాజీ సహకార సంఘం చైర్మన్ అల్లే జనార్దన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇల్తెం శంకర్, సొక్కం రవి, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








