Post Views: 91
నిజామాబాద్, అక్టోబర్ 12 (ప్రత్యేక ప్రతినిధి):
దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయదలచిన వారు తప్పనిసరిగా సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు.
కమీషనరేట్ పరిధిలో తాత్కాలికంగా టపాకాయల దుకాణాలు నెలకొల్పదలచిన వ్యాపారులు తమ ప్రాంతానికి చెందిన డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం సంబంధిత అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసినట్లయితే ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్–1884 మరియు రూల్స్–1933 (సవరణ 2008) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టపాకాయల దుకాణాదారులు తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనలు:
🔹 టపాకాయల దుకాణాలు ఖాళీ ప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేయాలి. ఆ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.
🔹 ఒక క్లస్టర్‌లో 50 షాపులకు మించరాదు.
🔹 జనరద్దీ ప్రాంతాలు, కళ్యాణ మండపాలు, సమావేశాల కేంద్రాల్లో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయరాదు.
🔹 తాత్కాలిక టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
🔹 పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత ఏసీపీ కార్యాలయంలో సమర్పించాలి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








