నిజామాబాద్, అక్టోబర్ 11:అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్యాంగ్‌పై పోలీసులు పిడీ చట్టం కింద చర్యలు చేపట్టారు. ఈ గ్యాంగ్ ప్రధాన సూత్రధారుడైన కోలనాటి నాగశివపై సెప్టెంబర్ 13, 2025న పి.డి యాక్ట్–1986 (Telangana Prevention Detention Act) అమలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అనంతరం అతనిని చెంచల్‌గూడ జైలుకు తరలించడం జరిగిందని తెలిపారు.
నిజామాబాద్ జిల్లా నుండి జారీ చేసిన పి.డి ఆర్డర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్ఫర్మ్ చేసినట్లు కూడా పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
సమాజంలో మట్కా, గుట్కా, గ్యాంబ్లింగ్ మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నవారు తమ పద్ధతులను మార్చుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు
ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉన్నవారు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు.
ప్రస్తుతం నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు నేరస్థుల వివరాలను సేకరించాలన్న ఆదేశాలు కమిషనరేట్ నుంచి జారీ చేసినట్లు సమాచారం.
ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. మాట్లాడుతూ –
“సమాజ శాంతి భంగం కలిగించే వారిపై నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. అట్టి వారిని పి.డి యాక్ట్ కింద తీసుకువచ్చి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు చట్టానికి సహకరించాలి, చట్టవ్యతిరేక కార్యకలాపాలు సహించబడవు,” అని హెచ్చరించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








