బోధన్ రైతులకు భారీ నష్టం – వెంటనే పరిహారం చెల్లించాలంటూ మాజీ ఎమ్మెల్యే షకీల్ డిమాండ్
ప్రతి ఎకరాకు ₹17–18 వేల ఆర్థిక సహాయం అందించాలంటూ ప్రభుత్వాన్ని కోరిన షకీల్ అమీర్
రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షం – షకీల్ వ్యాఖ్య
బోధన్, అక్టోబర్ 11:
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బోధన్ నియోజకవర్గంలో సుమారు 25 నుండి 30 వేల ఎకరాల వరకు పంటలు నష్టపోయాయని, మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ తెలిపారు. ఈ నష్టంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, కౌలు రైతులు ఎకరాకు ₹30,000 కౌలు చెల్లించడమే కాకుండా పంట ఖర్చులు కలిపి ఒక్కో రైతుకు సుమారు ₹50,000 వరకు నష్టం వాటిల్లిందని వివరించారు.
రైతుల ఈ దుస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ సహాయంగా ఎకరాకు కనీసం ₹17,000–₹18,000 చొప్పున పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
> “రైతు రక్తం కారితేనే దేశం నడుస్తుంది — రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది,” అని షకీల్ అమీర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ హామీలు గాలిలో కలిసిపోయాయి – షకీల్ ఫైర్
మహిళలకు, వృద్ధులకు, దివ్యాంగులకు, విద్యార్థులకు, కౌలు రైతులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని షకీల్ తీవ్ర విమర్శలు చేశారు.
“బాకీ కాడని కాంగ్రెస్ – వాగ్దానాలు మాత్రమే కాజేశారు” అనే పోస్టర్లను షకీల్ విడుదల చేశారు.
బోధన్ ఎమ్మెల్యేపై ఫైర్ – క్యాంప్ ఆఫీస్ మూసివేశారు, ప్రజలకు అందుబాటులో లేరు
ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ మూసివేయడం, ప్రజలతో దూరంగా ఉండడం దురదృష్టకరమని షకీల్ అన్నారు.
“ఇకనైనా రెండు రోజులు అయినా బోధన్ ప్రజలకు అందుబాటులో ఉండాలి” అని సూచించారు.
బోధన్‌లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని, టీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
‘సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తే నాకు కూడా సంతోషం’ – షకీల్
“నేను ఎవరిని విమర్శించడానికి మీడియా సమావేశం నిర్వహించలేదు.
బోధన్ అభివృద్ధి కోసం సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తే నేను కూడా ఆనందిస్తాను,” అని షకీల్ తెలిపారు.
అలాగే, కాంట్రాక్టు చేసిన వారి బిల్లులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరారు.
“పాత బిల్లులు విప్పించమంటే ఎర్రవల్లికి వెళ్ళమనడం సరికాదు,” అని వ్యాఖ్యానించారు.
‘అభివృద్ధిపై దృష్టి సారించండి’ – షకీల్ విజ్ఞప్తి
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను తిరిగి ప్రారంభించి ఒక పర్సనల్ అసిస్టెంట్ (PA) ను నియమించి నియోజకవర్గ సమస్యలను పర్యవేక్షించేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ప్రభుత్వం, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని కోరారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








