V1News Telangana

best news portal development company in india

క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

SHARE:

 

జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు జిల్లా రెడ్క్రాస్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్

కీట్ల పంపిణీ నీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని  Drబి.రాజశ్రీ మేడం  చేతుల మీదుగా ఐ డి ఓ సి వద్ద పంపిణీ చేయడం జరిగింది అని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్  బుస ఆంజనేయులు తెలియజేశారు.ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ డాక్టర్ బి రాజశ్రీ  మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం నిమిత్తం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయడం చాలా హర్షించదగ్గ విషయమని రెడ్ క్రాస్ సభ్యులను అభినందించారు. అదేవిధంగా జిల్లా రెడ్క్రాస్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను పంపిణీ చేయడానికి ముందుకు వచ్చినందుకు అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  తోట రాజశేఖర్,రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి  కరిపే రవీందర్, పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ సుప్రియ, రెడ్ క్రాస్ మోపాల్ మండల చైర్మన్  వెంకటేశ్వర్లు,శ్యామల, నాగరాజు,లబ్ధిదారులైన క్షయ వ్యాధిగ్రస్తులు మరియు వారి సహాయకులు పాల్గొన్నారు.

Boddula Ganesh Kumar
Author: Boddula Ganesh Kumar

Mobile no:-9515959863

best news portal development company in india