బోధన్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు గురువారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో తోపాటు ప్రతి ప్రాంతం ఖాళీ స్థలాలలో హరిత వనాలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాలని తెలిపారు కాలుష్య నివారణకు చెట్లు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మొక్కలను అందించారు వన మహోత్సవంలో భాగంగా నిర్దేశించిన మొక్కలను నాటి 100% పూర్తయ్యే విధంగా చూడాలన్నారు కళాశాలలోని పలు సమస్యలను విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా నాణ్యమైన విద్యను విద్యార్థులకు బోధించాలన్నారు రాబోయే రోజుల్లో ప్రభుత్వ కళాశాలలకు మంచి డిమాండ్ పెరుగుతుందని ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వెంటా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, గ్రంథాలయం చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి రామ్మోహన్రావు, పిసిసి డెలిగేట్ గంగా శంకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తూము శరత్ రెడ్డి, పాషా మొహీనుద్దీన్, ఆనంపల్లి ఎల్లయ్య, ఏఎంసీ చైర్మన్ శీల శంకర్, అంకు దామోదర్ రెడ్డి, నాగేశ్వరరావు, తలారి నవీన్, చిన్న ప్రమోద్, ఇంద్రకరణ్, తదితరులు ఉన్నారు
Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533








