న్యూఢిల్లీ, జూలై 7:దేశంలో ప్రముఖ టెలికాం సంస్థలు మొబైల్ రీచార్జ్ ధరలను మళ్లీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది చివరికి మరోసారి టారిఫ్‌లు 10% నుంచి 12% వరకు పెంచే యోచనలో ఉన్నాయి. అయితే ఈసారి బేసిక్ ప్లాన్లను కాదు.. మధ్యస్థ, ఉన్నత శ్రేణి వినియోగదారులపైే మళ్లీ ధరల భారం మోపేలా కంపెనీలు వ్యూహ రచన చేస్తున్నాయి.
ప్రస్తుతం 5జీ సేవల విస్తరణ వేగంగా జరుగుతుండటంతో, డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అధిక డేటా వాడే ప్రీమియం యూజర్లకు అందిస్తున్న సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు అదనపు పెట్టుబడులు అవసరమవుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి.
ఇటీవలి టారిఫ్ పెంపుతో పెద్దగా ప్రభావం పడని కంపెనీలు, ఇప్పుడు మెరుగైన ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టెలికాం సంస్థల CEOలు ఈ ఏడాది చివరినాటికి కొత్త టారిఫ్‌లను ప్రవేశపెట్టే అవకాశముందని సంకేతాలు ఇస్తున్నారు.
వీటి వల్ల ప్రత్యేకించి OTT బండిల్‌డ్ ఆఫర్లు, అధిక డేటా, రూమింగ్ సదుపాయాలున్న ప్లాన్లు మరింత ఖరీదవనున్నాయి. వినియోగదారులు ఇప్పటికే ఖర్చుల భారంతో నిట్టూరుస్తుండగా, ఈ కొత్త పెంపు మరింత భారం మోపే అవకాశముంది

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....