చండీ హోమం, భక్తుల ఉత్సాహం మధ్య విజయవంతం
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఊట్పల్లి గ్రామంలో జగదాంబ సేవలాల్ ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు, భక్తులు, తండావాసులు ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించగా, కార్యక్రమ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఆలయ మాజీ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు అందరూ విశేష సహకారం అందించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ –
“ఈ పుణ్య కార్యాన్ని మీ అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేయగలిగాము. ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
వేడుకల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవదర్శనం చేసుకున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....