Post Views: 256
భైంసా, జూలై 7:
భైంసా మండలంలోని బిజ్జూర్ గ్రామంలో ఎంఆర్‌పీఎస్ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్. హాజరై జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మాదిగల హక్కుల సాధనకోసం ఎంఆర్‌పీఎస్ ఆవిర్భవించింది. సామాజిక న్యాయం కోసం ఎంఆర్‌పీఎస్ చేసిన పోరాటం చారిత్రకమైనది. మాదిగులను ఏకతాటిపై నడిపిన మా నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి మనమందరం కృతజ్ఞతలు తెలపాలి” అని అన్నారు.
కార్యక్రమంలో మండలంలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, ఎంఆర్‌పీఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామమంతా కార్యక్రమం సందర్భంగా జెండాలతో, నినాదాలతో ఉత్సాహంగా మారిపోయింది.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533