సాలూర, జూలై 7, (వి1 న్యూస్) : గత సంవత్సరం నవంబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో భాగంగా సర్వే చేసిన కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయుటకు స్థానిక అధికారులు ప్రైవేట్ ఆపరేటర్లను ఏర్పాటు చేసుకుని డెటాను ఆన్లైన్లో నమోదు చేయించడం జరిగినది. ఇందు కోసం ఒక్కొ కుటుంబాన్ని ఆన్లైన్ నమోదు చేసినందకు ఆపరేటర్లకు 30 రూపాయలు చొప్పున చెల్లిస్తామని తెలిపి 8 నెలలు గడుస్తున్న తమకు ఒక్కరూపాయి చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూర మండల కేంద్రం నుండి సుమారు 50 మంది ఆపరేటర్లు ఈ డేటా ఎంట్రీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, ఒక్కొక్కరికి సుమారు రూ. 10 వేల నుండి రూ. 20 వేల వరకు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఆన్లైన్ చేసే క్రమంలో స్థానిక అధికారులు డబ్బులు నెల వ్యవదిలో మేము ఇప్పిస్తామని హమీ ఇచ్చి నెలలు గడుపు తుండటంతో పని చేయించుకుని పైకం ఇవ్వకపొవడంపై స్థానిక అధికారుల తీరు పట్ల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయంపై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు మొర పెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటి వెలుగు కార్యక్రమంలో రెండు సార్లు పాల్గొన్న తమకు ఒక్క రూపాయి పెండింగ్ లేకుండా ప్రతి నెల డబ్బులు చెల్లించారని తెలిపారు. ఇట్టి విషయంపై స్థానిక ఎమ్మెల్యే కల్పించుకుని తమకు డబ్బులు ఇప్పించాలని కొరుతున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....