– సేవా కార్యక్రమాలతో పేద ప్రజలకు సహకారాన్ని అందిస్తున్న యువ నాయకులు
– కార్యకర్తలకు, నిరుపేదలకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా
– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్
– బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని కామ్ షెట్ పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన టపాకాన లావణ్య అనే మహిళ అనారోగ్యం కారణంగా ఆదివారం రోజు హఠాన్మరణం చెందిన విషయం వెలుగు చూసింది. ఈ విషయాన్ని బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు చొరవ తీసుకొని బాన్సువాడ బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న శశాంక్ వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి మృతురాలి కుటుంబ సభ్యులకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం సున్నం సాయిలు చేతుల మీదుగా అందించారు. దీంతోపాటు కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ తృప్తి శివప్రసాద్ అంత్యక్రియలకు అవసరమైన సామాగ్రిని ఉచితంగా అందించారు. ఆర్థిక సహకారం అందించినందుకుగాను మృతురాలి కుటుంబ సభ్యులు కోనేరు శశాంక్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు అనుసూరి శ్రీనివాస్, గొడిసెల యాదగిరి గౌడ్, అరిగె నారాయణ, గంగాధర్ గుప్త, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..