హైదరాబాద్: ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు గురువారం (జూన్ 26) నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి సమర్పించే తొలి బోనం తో జాతర ప్రారంభం అవుతోంది. జూలై 21 వరకు ఈ ఉత్సవాలు నగరంలోని పలు దేవాలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.
జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, జూలై 20న పాతబస్తీలో అంగరంగ వైభవంగా బోనాలు జరుగనున్నాయి. జూలై 21న ఘటాల ఊరేగింపు, మారు బోనంతో జాతరకు సమాప్తి ఉంటుంది.
ప్రభుత్వం ఈసారి ఉత్సవాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు చేసింది. అదనంగా పాతబస్తీ ఉత్సవాలకు రూ.10 కోట్లను కేటాయించాలని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను కోరింది.
✨ బంగారు బోనాల ప్రత్యేకత:
ఈసారి సప్తమాతృకల బంగారు బోనాల పూజల్లో కేవలం మూడు దేవాలయాలకే బోనాలు సమర్పించనున్నారు.
నిషా క్రాంతి – గోల్కొండ జగదాంబ, సికింద్రాబాద్ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి
జోగిని శ్యామల – విజయవాడ కనకదుర్గమ్మ తల్లి
జోగిని అవిక – చార్మినార్, లాల్ దర్వాజా, పెద్దమ్మ తల్లి దేవాలయాలకు
📅 బంగారు బోనం షెడ్యూల్:
జూన్ 26: గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బంగారు బోనం
జూన్ 29: విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి
జూలై 2: బల్కంపేట ఎల్లమ్మ తల్లికి
జూలై 4: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి
జూలై 10: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి
జూలై 15: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి
జూలై 17: లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి
ఈసారి బోనాల ఉత్సవాలు తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా, మహిళల భాగస్వామ్యంతో మరింత వైభవంగా జరగనున్నాయి.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....