V1News Telangana

best news portal development company in india

ఇల్లు అవసరమై కొడుకులొస్తున్నారు… ఇందిరమ్మ ఇల్లు మాత్రం కనిపించట్లేదు!

SHARE:

. మా పేదరికానికి చిరునామా ఇదే – అయినా ఇల్లు ఎందుకు రాలేదు?. ఇల్లు లేని వాళ్లకు ఆశ చూపిన ప్రభుత్వం – ఆశే మిగిలిందా? సాలూర పేదరికానికి నిదర్శనం షేక్ నసీమ కుటుంబం – ఇల్లు కల మాత్రమేనా?. ఇల్లు లేని పేదలకు ఆశ… కాంగ్రెస్ పాలనలో మోసం?

సాలూర గ్రామం, నిజామాబాద్ జిల్లా:
పేదలకోసం కట్టిన ఇల్లు… పేదలకు మాత్రం దొరకట్లేదు. ఇది మాటల న్యాయం కాదు, సాక్షాత్తు సాలూరు గ్రామంలో జీవిస్తున్న షేక్ నసీమ కుటుంబం వాస్తవం. పది సంవత్సరాలుగా చిన్న గుడిసె లోనే జీవన యాతన సాగిస్తున్న ఆమె, భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు కొడుకులు, ఒక కూతురితో జీవితం సాగిస్తూ ప్రభుత్వంలో తలపెట్టిన ప్రతి పథకానికీ అర్హత కలిగినా — ఇప్పటికీ ఒక చిన్న ఇల్లు కూడా దక్కలేదు.“ఇందిరమ్మ ఇల్లు అంటే పేదోళ్లకు ఆసరా” అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుంటే, షేక్ నసీమ వంటి నిరుపేదలకు మాత్రం ఎందుకు ఈ ఆసరా ఇవ్వలేకపోతున్నారు? ఆమె కుటుంబంతో కలిసి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఇంకైనా మా పరిస్థితి పరిగణలోకి తీసుకుని మా వంతు ఇల్లు కేటాయించండి” అని కోరుతోంది.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తుందనే నమ్మకంతో ఎదురుచూస్తున్న ఈ కుటుంబం, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు స్పందించకపోతే ఎవరి చుట్టూ తిరగాలి? ఇల్లు ఉన్నవారికి మళ్లీ ఇల్లు… లేనివారికి కనీసం గుడిసెనే మిగిలిందా?ఇంకా ఏం మిగిలింది? ఈ కుటుంబపు కలలూ, కన్నీళ్లూ – అధికారుల కలంకంగా మిగిలిపోవద్దని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india
best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई