V1News Telangana

best news portal development company in india

వైరల్: జొన్న రొట్టె తింటే సిక్స్ ప్యాక్ వస్తుందట! – సీఎం రేవంత్ వ్యాఖ్యలు హాట్ టాపిక్….

SHARE:

ప్రతిరోజూ జొన్న రొట్టె తింటూ, ఎవరి దుస్తులు వాళ్లే ఉతుక్కుంటే… సిక్స్ ప్యాక్ బాడీ ఆటోమేటిక్‌గా వస్తుంది!” — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించిన “రైతు నేస్తం” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గ్రామీణ జీవన శైలి ఎలా ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో వివరించారు.

“అచ్చంపేటలో దోసకాయ పంట బాగా పండుతుంది. దోసకాయ, కందిపప్పు కూర వండి తింటే ఆ రోజు రుచులే వేరు. చికెన్, మటన్ కూడా దానికి ముందు పనికిరావు. ప్రతి రోజు జొన్న రొట్టె తింటే జిమ్ములకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు,” అని యువతకు హితవు పలికారు.

సీఎం చేసిన ఈ మాటలు ప్రత్యేకంగా యువతను ఆకట్టుకుంటుండగా, సోషల్ మీడియాలో మీమ్స్, చర్చలు మామూలుగా లేవు. “జొన్న రొట్టె = జిమ్?” అంటూ నెటిజన్లు సెటైర్లు, పొగడ్తలు పెడుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india
best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई