V1News Telangana

best news portal development company in india

ఇందిరమ్మ ఇండ్లకు అనేక ఆంక్షలు….. అక్రమ రవాణాకు స్వాగత తోరణాలు…ఐఏఎస్ ఉన్నా… ఆయుధం లేని వ్యవస్థ – మాఫియా రాజ్యంలో ప్రజలు బలి!

SHARE:

బోధన్, జూన్ 18 (బుధవారం):
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సరఫరా కావలసిన ఇసుకకు అధికారులు విధించిన ఆంక్షలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒక వైపు పేదల ఇంటికి తవ్విన గొయ్యిలో ఇసుక లేక కలలు తలకిందులవుతుంటే, మరోవైపు అక్రమ రవాణాకారులకు మాత్రం అధికార యంత్రాంగం స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసినట్లే కనిపిస్తోంది.

ప్రజల అనుభవం ప్రకారం, పగలు ప్రభుత్వ పనుల పేరిట ఇసుకను రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. రాత్రివేళ టిప్పర్ల గర్జనతో ఎక్కడో తవ్విన ఇసుక వేలాది రూపాయలు విలువ చేసే ఖజానాను దోచేస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి తూటాలు పడుతుండగా, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బోధన్ డివిజన్‌కి ఐఏఎస్ అధికారి ఉన్నా, పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. పేదల ఇండ్లకు ఒక ట్రాక్టర్ ఇసుక రాకుండా అడ్డుకునే సిబ్బంది… మాఫియాల వాహనాలకు మాత్రం మార్గదర్శకులవుతున్నారు. ఇది చూసిన ప్రజలు “ఇది అధికార పాలనా లేక మాఫియా రాజ్యమా?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ఇంటి గోడలు ఎత్తుకాలేని పరిస్థితిలో ఉండగా, మాఫియాల కోట్లు ఎత్తుకు చేరుతున్నాయి. అధికారుల కింద స్థాయి వ్యవస్థపై ప్రజల్లో అనేక అనుమానాలు బలపడుతున్నాయి. “కారణాలు చెప్పేవాళ్లే లేరు… పరిష్కారాలు చూపేవాళ్లూ కనిపించరు” అని నిరాశతో తలలు పట్టుకుంటున్నారు లబ్ధిదారులు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india
best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई