V1News Telangana

దొంగతనాలు జరుగుతున్నాయి….. అధికారులకు పట్టింపు లేదా!

బోధన్ రూరల్ : మంజీరా పరివాహక ప్రాంతం ఒడ్డున ఉన్నటువంటి సాలురా ఎత్తిపోతల పథకాం దొంగతనాలకు అడ్డగా మారింది.గత 15 రోజుల క్రిందట ఎత్తిపోతలం పథకం సెటర్లను పగులగొట్టి అందులోని విలువైన సామాగ్రిని దొంగలించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.అనేక మార్లు ఎత్తిపోత పథకం వద్ద దొంగల బీభత్సవం చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.దొంగతనం జరిగినప్పుడు మాత్రమే అధికారులు,పోలీసు యంత్రాంగం అప్రమత్తమవుతున్నారే తప్ప మరి ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని సాలురా మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల ఎత్తిపోతల పథకం వద్ద పహారా ఉన్నటువంటి వ్యక్తులపై సైతం దొంగలు తీవ్రస్థాయిలో దాడులు చేసి ట్రాన్స్ఫార్మర్ సామాగ్రిని అపహరించడానికి ప్రయత్నం చేసిన విషయం విధితమే.ఈ దొంగతనాలలో ఇంటి దొంగ ఉండి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అధికారులు మరియు పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడంపై ప్రజలు బగ్గుమంటున్నారు.సాలురా ఎత్తిపోతల పథకంలో వరుస దొంగతనాలు చోటు చేసుకోవడంతో ఎత్తిపోతల పథకం ఎక్కడ మూతపడుతుందోనని సాలురా ప్రాంతా రైతాంగం గుబులుకు లోనవుతున్నారు.ఎత్తిపోతల పథకంలోని సామాగ్రిని దొంగలు అపహరించడంతో ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు నీరు అందడం ప్రశ్నార్ధకంగా మారింది.అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని సాలురా ఎత్తిపోతల పథకాన్ని కాపాడవలసిందిగా రైతులు కోరుతున్నారు.

—- ఎత్తిపోతల పథకంలో దొంగతనాలను అరికట్టాలి.

రైతు ఇల్తెపు గంగారాం.

సాలురా ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకుంటున్నా దొంగతనాలను అరికట్టాలి.ఇటీవల ఎత్తిపోతల పథకం యొక్క సెంటర్లను పగలగొట్టి విలువైన సామాగ్రి దొంగతనానికి గురి అయింది.సాలురా ఎత్తిపోతల పథకం ద్వారా 1600 ఎకరాలకు సాగునీరు అందుతుంది.6 నుంచి 7 చెరువులు నీటితో జలకళలాడుతాయి.ఎత్తిపోతల పథకంలో దొంగతనాలు చోటు చేసుకోవడం వలన రైతులకు సమయానికి సాగునీరు అందడం లేదు.అధికారులు మరియు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకొని ఎత్తిపోతల పథకంలో దొంగతనాలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.ఎత్తిపోతల పథకం నూతన కమిటీని ఏర్పాటు చేయాలి.అప్పుడే రైతులకు సమయానికి సాగునీరు అందుతుంది.ఎత్తిపోతల పథకం అభివృద్ధి సాధ్యమవుతుంది.ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నూతన కమిటీ ఎన్నికకు ఆదేశాలు ఇవ్వాలి.దొంగతనాలు చోటు చేసుకోకుండా అధికారులతో పాటు కమిటీ వారు కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post