V1News Telangana

best news portal development company in india

అంగన్వాడీ కేంద్రంలో “సామూహిక అక్షరాభ్యాస”కార్యక్రమం నిర్వహణ….

SHARE:

– “పూర్వ ప్రాథమిక విద్య” ప్రాముఖ్యతను పిల్లల తల్లిదండ్రులకు వివరణ

– మూడు సంవత్సరాలు వయస్సు దాటిన పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలి

– పిల్లలకు చదువుల తల్లి కృపా కటాక్షాలు కలగాలని ఆకాంక్ష

– ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా : నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో గల 2 వ అంగన్వాడి కేంద్రంలో మంగళవారం రోజు మూడు సంవత్సరాలు వయస్సు దాటి నూతనంగా అంగన్వాడీ కేంద్రంలో చేరిన చిన్నారులందరికీ వారి తల్లిదండ్రుల సమక్షంలో “సామూహిక అక్షరాభ్యాసం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి పాల్గొన్నారు. ఆమె ఆధ్వర్యంలో పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఆప్యాయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “పూర్వ ప్రాథమిక విద్య” యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు క్లుప్తంగా వివరించారు. చిన్నారులందరికీ చదువుల తల్లి సరస్వతీదేవి కృపా కటాక్షాలు కలగాలని.. చిన్నారులందరూ చదువులలో, తెలివితేటలలో బాగా రాణించాలని కోరారు. తల్లిదండ్రులు మూడు సంవత్సరాలు వయసు దాటిన పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం.. చదువుతోపాటు క్రమశిక్షణ, ఆటలు ,పాటలు ఉత్సాహంగా బోధిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పుట్ట భాస్కర్, అంగన్వాడి టీచర్ లు లలిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india
best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई