V1News Telangana

అంగన్వాడి కేంద్రం లో (ECCE) డే నిర్వహణ…..

– పిల్లలలో ఉత్సాహం, తెలివితేటలు మెరుగుపరచడానికి నిర్వహణ

– పిల్లల ప్రదర్శన చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు

– నూతనంగా చేరిన పిల్లలకు “సామూహిక అక్షరాభ్యాసం నిర్వహణ”

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల మొదటి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం రోజు టీచర్ గౌరమ్మ ఆధ్వర్యంలో ( ECCE ) (Early child care education) డే మరియు “సామూహిక అక్షరాభ్యాసం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పిల్లలు చదువు, ఆటలు,పాటలు వారి తల్లిదండ్రుల సమక్షంలో చూడముచ్చటగా ప్రదర్శించారు. పసిపిల్లల ప్రతిభను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఈ సందర్భంగా టీచర్ గౌరమ్మ మాట్లాడుతూ పిల్లలకు చదువుతోపాటు ఆటలు, పాటలు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. పిల్లలలో ఉత్సాహం నింపడానికి మరియు తెలివితేటలు మెరుగుపడే విధంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతినెల చివరి వారంలో( ECCE ) డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లలకు ప్రోత్సాహకరంగా ఉండే విధంగా ( assesment) కార్డులను కూడా ఇస్తున్నామని తెలియజేశారు. నూతనంగా అంగన్వాడీ కేంద్రంలో చేరిన పిల్లలకు “సామూహిక అక్షరాభ్యాసం” కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post