V1News Telangana

best news portal development company in india

బిజెపి కార్యకర్తల కు భీమా సౌకర్యంతో భరోసా కల్పించిన NRI ….

SHARE:

– కార్యకర్తలే పార్టీ అభివృద్ధికి శ్రీరామరక్ష

– వారి బాగోగులను దృష్టిలో ఉంచుకొని భీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడి

– చాలా సందర్భాలలో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం

– బిజెపి పార్టీ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి

– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్

– నసురుల్లాబాద్ బిజెపి మండల అధ్యక్షులు సున్నం సాయిలు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు రామాలయం ఆవరణలో బిజెపి నాయకులు ,NRI కోనేరు శశాంక్ తన స్వంత ఖర్చులతో కార్యకర్తల బాగోగులను దృష్టిలో ఉంచుకొని వారికి మరియు వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి పోస్టల్ శాఖ వారి ఆరోగ్య భీమా, ప్రమాద భీమా పాలసీలను చేయించడానికి నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోనేరు శశాంక్, దొరబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి శ్రీరామరక్ష అని అలాంటి కార్యకర్తల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని భీమా పాలసీలు చేయించి వారి జీవితాలకు మరియు వారి కుటుంబాలకు భద్రత కల్పించే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని తెలిపారు. చాలా సందర్భాలలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కొరకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసి అనుకోని పరిస్థితులలో ప్రాణాలను కూడా కోల్పోయిన సంఘటనలు చాలా తన దృష్టికి వచ్చాయని అన్నారు. అలాంటి సంఘటనలు చూసినప్పుడు తన మనస్సు చలించిపోయిందని అప్పుడే తన మనస్సులో పార్టీ అభివృద్ధికి మరియు నాయకుల అభివృద్ధికి నిరంతరం కృషి చేసే కార్యకర్తలకు ఏదైనా సహకారం అందించాలనే సంకల్పంతో భీమా సౌకర్యం కల్పించడం చాలా సంతృప్తిగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అమలు చేసే విధంగా సన్నాహకాలు చేస్తున్నామని తెలియజేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా, చురుకుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో ప్రతి నాయకులు, కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా నిరంతరం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నసురుల్లా బాద్ మండల కార్యదర్శి మేకల రాములు, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, రాజు, శక్తి కేంద్రం ఇంచార్జ్ గంగాధర్ గుప్తా, కిసాన్ మోర్చా అధ్యక్షుడు యాదగిరి గౌడ్, బూత్ అధ్యక్షులు కంది పెద్ద మల్లేష్, ఉల్లెంగ గోపి, సీనియర్ నాయకులు అరిగె నారాయణ, సాయ గౌడ్, మనూర్ సాయిలు, రాఘవ, లక్ష్మణరావ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india