V1News Telangana

best news portal development company in india

ఏప్రిల్ 8: ఆర్ఎస్ఎస్-బిజెపి విధానాలకు వ్యతిరేకంగా అఖిలభారత నిరసన దినం.. మత విద్వేషానికి నిరసనగా సిపిఐ (ఎం-ఎల్) మాస్ లైన్ ఉద్యమం.. లౌకికత రక్షణకు ప్రజల మద్దతుతో నిరసన దినాన్ని విజయవంతం చేద్దాం – బి. మల్లేష్ పిలుపు… ఔరంగజేబు సమాధి వివాదంపై సంఘ్ పరివార్ కుట్ర – సిపిఐ (ఎం-ఎల్) ఆగ్రహం..

SHARE:

బోధన్:
సిపిఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ ఆర్ఎస్ఎస్-బిజెపి ల ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 8న అఖిలభారత నిరసన దినాన్ని పాటించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ పాత బోధన్ పోస్టాఫీస్ వద్ద కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కార్మికులు, రైతులు, యువత, మహిళలు, మైనార్టీలు, ఆదివాసీలు, చిన్న వ్యాపారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కోరుతూ నిరంతర పోరాటాల్లో ఉన్నారని చెప్పారు. ఇదే సమయంలో సంఘ్ పరివార్ మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఔరంగజేబు సమాధి వివాదాన్ని రేకెత్తించేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.

బాబ్రీ మసీదు ఘటన మాదిరిగా, సమాజాన్ని మతపరంగా విషపూరితం చేయడమే ఆర్ఎస్ఎస్-బిజెపి లక్ష్యమని విమర్శించారు. లౌకిక విలువల పరిరక్షణకు ప్రజలంతా కలసి నిలవాలని, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరగనున్న నిరసన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బి. మల్లేష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్, జి. సీతారాం, బి. సాయిలు, లింగం, శంకర్, పోశెట్టి, రాజు, గంగామణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india