V1News Telangana

కాసుల బాలరాజ్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ జెడ్పిటిసి….

– ద్రోణవల్లి సతీష్

బీర్కూర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ తన సొంత నివాసంలో ఆదివారం రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాసుల బాలరాజ్ ఇతర వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలపై చేసే అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు మానుకోవాలని లేనియెడల రాజకీయ భవిష్యత్తు మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. శనివారం రోజు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించి మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడి మరణం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అతను మరణిస్తే దానిని వక్రీకరించి అనారోగ్యంతో మరణించాడని మాట్లాడడం సబబు కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా నాపై కూడా పలుమార్లు మీడియా సమక్షంలో అసత్య ప్రచారాలు చేయడం వలన మీ వ్యక్తిత్వం సరిగ్గా లేదని అన్నిసార్లు ఓడిపోవడం జరిగిందని ఎద్దేవా చేశారు. ప్రతిసారి నా పైన అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు చేస్తూ తమ స్థాయిని తగ్గించుకుంటున్నారని విమర్శించారు. ఒకవేళ తాను అవినీతికి పాల్పడినట్లు నియోజకవర్గ శాసనసభ్యుల సమక్షంలో రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని సవాలు విసిరారు. ఏ దైవ సన్నిధిలోనైనా ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని.. ఎక్కడికి రమ్మన్నా వచ్చి నిజాయితీ నిరూపించుకుంటానని తెలియజేశారు. ఎదుటివారిపై అక్కస్సుతో ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం మీ రాజకీయ మనుగడకే కలంకమని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

జై బాపు జై భీమ్ జై సంవిధాన్” కార్యక్రమం ఘనంగా ముగిసింది… . బోధన్ పట్టణంలో కాంగ్రెస్ నేతల శ్రమదాన ర్యాలీ… . గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించిన నేతలు…. ఇంటింటా ప్రచారం – కాంగ్రెస్ అభివృద్ధి కార్యాచరణపై నేతల అవగాహన…. . సమాజహితం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రమ – గ్రామస్తుల నుండి విశేష స్పందన…

రాంపూర్‌లో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమం ఘనంగా . భారత రాజ్యాంగ రక్షణ కోసం కాంగ్రెస్ నాయకుల ప్రతిజ్ఞ రాంపూర్‌లో కాంగ్రెస్ నాయకులతో రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ . నిర్మల్ జిల్లా రాంపూర్‌లో రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన . “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల చొరవ

భైంసాలో హనుమద్దీక్షా మాలాధారణ మహోత్సవం ఘనంగా ప్రారంభం… . 41 రోజుల హనుమద్దీక్షా మాలాధారణ భక్తి పరవశ్యంలో ప్రారంభం.. . శ్రీ హనుమాన్ ఆశీస్సులతో భైంసాలో భక్తి కార్యక్రమం.. . శ్రీ హనుమద్దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో మహోత్సవం… . భక్తుల సందోహంలో భైంసా హనుమద్భక్తి ఉత్సాహం..

జై బాపు జై బీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఘనంగా ముగిసింది.. . సారంగాపూర్ మండలంలో కాంగ్రెస్ నాయకుల శ్రమదాన ర్యాలీ.. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు.. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ప్రజలకు తెలియజేసిన నాయకులు. గ్రామాల్లో ఇంటింటా ప్రచారం – కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని వివరించిన నాయకత్వం.

బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇంచార్జ్‌గా శీల శంకర్ బాధ్యతల స్వీకారం.. రైతుల సేవకే నా కృషి – బోధన్ ఏఎంసి చైర్మన్ శీల శంకర్… . మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి శీల శంకర్ కృతజ్ఞతలు.. . కాంగ్రెస్ పార్టీ నాయుకుడిగా శీల శంకర్‌కు నూతన బాధ్యతలు… బోధన్ నియోజకవర్గంలో శీల శంకర్‌కు ఘన సన్మానం..

Flipkart ధరల పెంపు: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి!… . 900 పైగా ఔషధాల ధరలు పెంపు – కొత్త రేట్లు ఇవే!… . గుండె, డయాబెటిస్, యాంటీబయాటిక్స్ మందులపై ధరల పెరుగుదల.. NPPA ప్రకటన: WPI ఆధారంగా ఔషధ ధరలు సవరణ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మెడిసిన్ ధరలు పెరిగిన విధానం..