V1News Telangana

best news portal development company in india

మహిళలను గౌరవిస్తూ సత్కరించుకోవడం మనందరి బాధ్యత….

SHARE:

– మహిళా ఎస్సై మరియు తోటి సిబ్బందిని ఘనంగా సత్కరించిన బిజెపి నాయకులు

– వారి ఎదుగుదలను ప్రశంసిస్తూ అభినందనలు

– పురుషులతో పోటీపడి స్త్రీలు అభివృద్ధిని సాధించాలని ఆకాంక్ష

– బిజెపి మండల అధ్యక్షులు సున్నం సాయిలు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై లావణ్య ను మరియు సిబ్బందిని శనివారం రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సున్నం సాయిలు మాట్లాడుతూ మహిళలను గౌరవిస్తూ సత్కరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. మహిళలు గొప్ప శక్తులుగా ఎదగాలని కోరుకున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్యను అభ్యసించి ఎస్సైగా మరియు మహిళా కానిస్టేబుల్లు గా ధైర్యంగా విధులు నిర్వహిస్తూ భావితరాలకు మార్గదర్శకులుగా నిలుస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు . స్త్రీమూర్తులను వారి గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలల వ్యాపించే విధంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సున్నం సాయిలు, ఉపాధ్యక్షులు అనుసూరి శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షులు యాదగిరి గౌడ్, సీనియర్ నాయకులు రవి డాక్టర్, అరిగె నారాయణ, అనిల్ గుప్తా, కటికె హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india