– ఆర్ అండ్ బి అతిథి గృహంలో సన్నాహక సమావేశం నిర్వహణ
– “ఎస్సీ వర్గీకరణ”అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
– మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితం “ఎస్సీ రిజర్వేషన్ ”
– ప్రభుత్వం మాట తప్పిన యెడల మాదిగల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిక
– ఫిబ్రవరి 7న భారీ బహిరంగ సభకు హాజరుకావాలని మాదిగ సోదరులకు పిలుపు
– ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ మంథని సామ్యేల్
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో గల ఆర్ అండ్ బి అతిథి గృహం ఆవరణలో ఆదివారం రోజు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ మంథని సామ్యేల్ మాట్లాడుతూ “ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ”సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని లేనియెడల మాదిగల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఎవరి దయాదాక్షిణ్యలవల్ల రాలేదని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా తీర్పు వచ్చిందని గుర్తు చేశారు.

సాధించిన ఫలితాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్ తో ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో “ఎస్సీ వర్గీకరణ” అమలు కొరకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించబోయే భారీ సాంస్కృతిక ప్రదర్శన బహిరంగ సభకు మాదిగ ఉపకులాలకు చెందిన వారు అధిక సంఖ్యలో పాల్గొని హక్కుల సాధనకై చేసే పోరాటాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ క్రమంలో “చలో హైదరాబాద్ లక్షల డప్పులు.. వేల గొంతులు” కార్యక్రమం యొక్క”గోడ ప్రతులను” “కరపత్రాలను”ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గరుగళ్ళ బాల్ రాజ్,MSF మెక్కా సాయి,MRPS నసురుల్లాబాద్ మండల కన్వీనర్ టేకుర్ల సాయిలు,ఎడ్ల గంగారాం, దొబ్బల గంగాధర్, ఎర్ర వట్టి పోశిరాం, మోచి గణేష్, రాజు, విట్టల్, అంబిల్పూర్ రాజు, దాకయ్య , టేకుర్ల కృష్ణ, సాయిలు, మోహన్, హన్మండ్లు మాదిగ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








