ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య ఆధీనియం అను చట్టాల అమలు తీరును పరిశీలించుట కొరకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు (బి.పి.ఆర్.డి) బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు (ఎన్.సి.ఆర్.బి) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, (సి.డి.టి.ఐ) సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ మరియు ఐబి ఇంటిలిజెన్స్ బ్యూరోల ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సి డి టి ఐ హైదరాబాద్ డైరెక్టర్ శ్రీ రాజశేఖరన్, ఐపిఎస్., డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారి ఆధ్వర్యంలో.
ఈ రోజు నిజామాబాద్ కమిషనరేట్ కు విచ్చేసి వివిధ శాఖల అధికారులతో చర్చించి వారి సందేహాలను మరియు అభిప్రాయాలను సేకరించారు. ముందుగా సి డి టి ఐ డైరెక్టర్ రాజశేఖరన్, IPS., నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, IPS., గారితో కలిసి
ACP లు, CI లు, SI లు, ఎస్ హెచ్ ఓ లతో పాటుగా .ఐటి కోర్ సిబ్బంది , పోలీసు స్టేషన్ రైటర్స్ తో . పోలీస్
కమిషనరేట్.కమాండ్ కంట్రోల్ యందు.నూతన నేర న్యాయ చట్టాల అమలు తీరుపై చర్చించినారు.కొత్త నేర న్యాయ చట్టాల.అమలులోఎదురుకొంటున్న సమస్యలగురించి సిబ్బందికి గల సందేహలను నిర్విప్తము చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చిన కుర్ర శ్రీనివాస్, రాజేష్ కుమార్ ఝ, సూరేపల్లి శ్రీనివాస్, వారి సిబ్బందితోపాటుగా నిజామాబాదు అదనపు DCP ( అడ్మిన్ ) కోటేశ్వర్ రావ్ , నిజామాబాద్ , బోధన్ , ఆర్మూర్ ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి , శ్రీనివాస్ , బస్వా రెడ్డి , సైబర్ క్రైమ్ ఏసిపి వెంకటేశ్వరరావు , సిసిఆర్బి ఏసిపి రవీందర్ రెడ్డి , ట్రాఫిక్ ఏసిపి నారాయణ మరియు జిల్లాలోని వివిధ ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు, రైటర్లు మరియు ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....