మండల కేంద్రంలోని బడా పహాడ్ దర్గాలో హుండీ లెక్కింపు నిన్న రాత్రి వాక్ బోర్డ్ అధికారుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. డబ్బులు మరియు నగలను లెక్కించే సమయంలో కొన్ని డబ్బులు మరియు కొన్ని అభరణాలను తన కింద పెట్టుకున్నారని వాక్ఫ్ బోర్డ్ డిప్యూటీని తహసిల్దార్ అక్కడి నుండి బయటకు పంపించేశారని అక్కడున్న స్థానికులు చెబుతున్నారు.
వాక్ బోర్డ్ అధికారులు డిప్యూటీ పై మెమో కూడా జారీ చేస్తారని చెబుతున్నారట. లెక్కించే సమయంలోనే అవినీతి జరుగుతుందని స్థానిక తహసిల్దార్ ను మరియు పోలీస్ శాఖను అక్కడుంచి వారి ఎదుటనే వీళ్ళతో లెక్కింపులు చేయడం జరిగింది. అధికారులు ఎదుట ఉన్న ఏ రకంగా డబ్బులు మరియు నగలు కొట్టేయాలని ఆలోచనతో కొందరు వాక్ఫ్ బోర్డు లోనే చీడపురుగులు ఉన్నట్లు బడా పహాడ్ లోని కొందరు సీనియర్ ముజావరులు సైతం ఆరోపిస్తా వస్తున్నారు. ఈ రకంగా కళ్ళ ఎదుటనే దౌర్జన్యం దోపిడీకి పాల్పడిన వారు వీళ్లకు తెలువకుండా ఎన్ని కోట్ల రూపాయలు దోచేస్తున్నారో ఒక్కసారి వాక్ఫ్ బోర్డ్ ఆలోచన చేయాలని బడపాడ్ దర్గాలోని కొందరు ముజావర్లు కోరుతున్నారు. భక్తుల వద్ద నుండి 5000 10,000 వేల కు పైగా తీసుకున్న రోజులు కూడా ఉన్నాయని లక్షల్లో సంపాదనకు అడ్డగ బడపహాడ్ దర్గా మారిందని,భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దందాలు నడిపిస్తున్నారని ఇష్టానుసారం దోచుకున్న వాడిదే రాజ్యం అన్నట్టు బడపాడ్ దర్గాలో వ్యవహరించడం కొత్తెం కాదు అదే విధంగా ఈరోజు లెక్కింపు సమయంలో కూడా అధికారుల ఎదుట డబ్బులు దోచుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని బడా పహాడ్ దర్గాకు వెళ్లే భక్తులు సైతం నిరాశ చెందుతున్నారు. ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని దర్గాలో దోచుకుంటున్న వారి పైన చర్యలు తీసుకోవాలని వెంటనే కమిటీని మార్చాలని వాక్ఫ్ బోర్డు లో ఉన్న వారు కూడా కొందరు చీడ పురుగులేనని వాక్ఫ్ బోర్డు నిజమైన వారికి న్యాయం చేసే వారికి మరియు భక్తులకు సహాయ సహకారాలు అందించే వారిని దర్గాలో నియమించాలని స్థానికులు కోరుతున్నారు. రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారి ఎదుట డబ్బులు దోచేయాలని కాచేయాలని చేసిన డిప్యూటీ పై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....