కాంట్రాసెప్టివ్స్ (Contraceptive) లేదా గర్భనిరోధకాలు ప్రస్తుతం ఆడవారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలోనే మగవారికి కూడా సురక్షితమైన గర్భనిరోధకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ఓపెన్ యాక్సెస్ జర్నల్ ఆండ్రాలజీలో ప్రచురించిన ఓపెన్-లేబుల్ అండ్ నాన్-రాండమైజ్డ్ ఫేజ్-III అధ్యయనం ఫలితాలు.. సురక్షితమైన మేల్ కాంట్రాసెప్టివ్స్ త్వరలోనే నిజం కానున్నాయని సూచిస్తున్నాయి. ఈ అధ్యయనంలో భాగంగా స్పెర్మ్ డక్ట్‌లోకి ఇంజెక్ట్ చేసి, తర్వాత రివర్స్ చేయగలిగే కొత్త మగ గర్భనిరోధకాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిశోధకులు తాజాగా విజయవంతంగా టెస్ట్ చేశారు.
ICMR పరిశోధకులు రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ (RISUG) అని పిలిచే ఈ మగ గర్భనిరోధకాన్ని తయారు చేశారు. ఇది ఒక ఇంజక్షన్ లాంటిది. పెళ్లయిన, సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉన్న 303 మంది ఆరోగ్యవంతమైన పురుషులపై దీన్ని విజయవంతంగా పరీక్షించారు. రిసెర్చర్లు ఏడు సంవత్సరాలుగా ఈ 303 మంది పురుషులను పర్యవేక్షిస్తున్నారు. ఏడేళ్ల టెస్టింగ్ తర్వాత RISUG ఇంజక్షన్ సురక్షితమైనదని, గర్భధారణను నివారించడంలో ప్రభావవంతమైనదని కనుగొన్నారు.
* ఎలా పని చేస్తుంది?
RISUG అనేది వృషణాల (Testicles) నుంచి పురుషాంగం వరకు స్పెర్మ్ (Sperm)ను తీసుకువెళ్ళే ట్యూబ్‌లోకి పాలిమర్ (Polymer)ను ఇంజెక్ట్ చేయడం ద్వారా పనిచేస్తుంది. ఆ పాలిమర్ అనేది స్పెర్మ్ ట్యూబ్ గుండా వెళ్ళకుండా అడ్డుకుంటుంది, వాటిని దెబ్బతీస్తుంది, తద్వారా అవి స్త్రీ అండాన్ని ఫలదీకరణం చేయలేవు. RISUGని ఐఐటీ ఖరగ్‌పూర్‌కి చెందిన డాక్టర్ సుజోయ్ కుమార్ గుహ కనుగొన్నారు. ఆయన 1979లో దీనిపై మొదటి రిసెర్చ్ పేపర్‌ను ప్రచురించారు. ఈ గర్భనిరోధక ఇంజక్షన్ చివరి దశ ట్రయల్స్‌ను పూర్తి చేయడానికి 40 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పట్టింది.
ప్లేట్‌లెట్ కౌంట్ పెంచే ఆహారం..
ఈ పరిశోధన కోసం కేంద్ర ఆరోగ్య శాఖ నిధులు సమకూర్చింది. భారతదేశం అంతటా ఐదు ఆసుపత్రులలో కండక్ట్ చేసిన అధ్యయనంలో RISUG గర్భనిరోధక రేటు 99.02% ఉందని తేలింది, ఇది కండోమ్‌కు చిల్లులు పడే రేటు (12%-18.6%) కంటే ఎక్కువ అని పరిశోధకులు కనుగొన్నారు. RISUG కారణంగా 97.3% మంది పురుషుల వీర్యంలో ఎలాంటి సజీవమైన శుక్రకణాలు (Sperm) ఉండవని కూడా ఇది చూపించింది. ఈ పరిస్థితిని అజోస్పెర్మియా అని పిలుస్తారు. ఈ అధ్యయనం RISUG తీసుకున్న పురుషుల భార్యల ఆరోగ్యాన్ని కూడా చెక్ చేసింది, వారిలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలను కనుగొనలేదు.
ఇది కూడా చదవండి: రైల్వే, ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..
RISUG జ్వరం, ఇన్‌ఫ్లమేషన్, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి కొన్ని చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుందని అధ్యయనం కనుగొంది, అయితే అవి కొన్ని వారాల నుంచి మూడు నెలలలోపు నయమైనట్లు పరిశోధకులు గుర్తించారు. మానసిక స్థితి, బరువు, లిబిడో (Libido)ను ప్రభావితం చేసే హార్మోన్ల గర్భనిరోధకాల మాదిరిగా కాకుండా, RISUG ఇతర శరీర భాగాలతో ఇంటరాక్ట్ అవ్వలేదని కూడా అధ్యయనం తేల్చింది.
మేల్ కాంట్రాసెప్టివ్ కోసం RISUG ఒక మంచి ఎంపిక అని అధ్యయనం నిర్ధారించింది. ఎందుకంటే ఇది అడ్మినిస్టర్ చేసుకోవడం ఈజీ, లాంగ్-లాస్టింగ్ రివర్సబుల్ ఎఫెక్ట్స్ కూడా కలిగి ఉంటుంది. మాస్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్‌లో RISUGని ఉపయోగించవచ్చని అధ్యయనం సూచించింది.
ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ప్రత్యేక ల్యాబ్‌లో ఈ గర్భనిరోధకాన్ని ఒక ప్రత్యేక పాలిమర్‌తో చాలా కష్టపడి తయారు చేశామని పరిశోధకులు తెలిపారు. ఇది 13 సంవత్సరాల వరకు పని చేస్తుందన్నారు. RISUGని పురుషులకు వృషణాల్లో సూది ద్వారా ఇస్తారు. ఇంజక్షన్ వల్ల పెద్దగా పెయిన్ ఉండదు. ఎందుకంటే ముందుగా నొప్పి కలగకుండా వృషణాలు మొద్దుబారడానికి ఒక మెడిసిన్ ఇస్తారు. RISUG ట్యూబ్ లోపల అంటుకునే పదార్థంలా పనిచేస్తుంది. RISUG స్పెర్మ్‌ను కలిసినప్పుడు, అది వాటి తోకలను విచ్ఛిన్నం చేస్తుంది, కాబట్టి అవి అండాలను చేరుకోలేవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..
]
Source link

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....