V1News Telangana

best news portal development company in india

నిజామాబాద్ జిల్లా భోదన్‌లో పెట్రోల్ బంకులపై అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు… ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

SHARE:

 

నిజామాబాద్ జిల్లా భోదన్ పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారింది. పట్టణంలోని పాత బస్ స్టాండ్, శక్కర్ నగర్ ప్రాంతాల్లోని కొన్ని పెట్రోల్ బంకులు “అవుట్ ఆఫ్ స్టాక్” బోర్డులు పెట్టి ఈరోజు పూర్తిగా మూసివేయడం జరిగింది.

పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడంతో రోజువారీగా వాహనాలకు ఇంధనం నింపుకునే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని అవసరాల కోసం బయటకు వెళ్లాల్సిన ప్రజలు గంటల తరబడి బంకుల వద్ద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయంపై స్థానిక ప్రజలు మరియు కొంతమంది బంకు యజమానులు చెప్పిన వివరాల ప్రకారం — స్టాక్ లేకపోవడంతోనే బంకులు మూసివేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇంధనం సరఫరాలో మార్పులు జరిగి, ముందుగా క్రెడిట్ లేదా ఇతర విధానాల్లో సరఫరా జరిగేదని, ఇప్పుడు మాత్రం నగదు ముందస్తుగా చెల్లించిన తర్వాతే పెట్రోల్, డీజిల్ పంపుతున్నారని సమాచారం.

దీంతో చిన్న, మధ్య తరహా బంకు యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, దాని ప్రభావం నేరుగా సాధారణ ప్రజలపై పడుతోంది.

ప్రభుత్వం మరియు ఆయిల్ కంపెనీలు వెంటనే స్పందించి ఇంధన సరఫరా సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india