సాలూర సరిహద్దులో ఇసుక మాఫియా అల్లరి..?
రాత్రి వేళల్లో సీక్రెట్‌గా ఇసుక తరలింపు ఆరోపణలు.
ధాబాలు కవరింగ్ సెంటర్లా..?
సాలూర సరిహద్దులో ఇసుక మాఫియా పై అనుమానాలు…
చీకటిలో చెలరేగుతున్న ఇసుక దందా..?
సాలూర సరిహద్దులో మాఫియా కదలికలపై ప్రజల ఆరోపణలు..
తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సాలూర మండలం మీదుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని స్థానిక ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సాలూర సరిహద్దు ప్రాంతాల నుంచి బోధన్, నిజామాబాద్ ప్రాంతాలకు రాత్రి వేళల్లో భారీగా ఇసుక తరలింపులు జరుగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
స్థానికుల సమాచారం ప్రకారం బొలెరో వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలను ఉపయోగించి రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 2గం.గంటల వరకు విచ్చలవిడిగా ఇసుక రవాణా జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
మహారాష్ట్రలోని ఇసుక క్వారీ నుంచి గత నెల రోజులుగా ఇసుక రవాణా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే లీగల్ విధానంలో వెహిబిల్ తీసుకుని ఇసుక తరలిస్తే ఆశించినంత లాభాలు రావడం లేదనే కారణంతో కొందరు మాఫియా దళాలు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను సాలూర–బోధన్ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ధాబాల్లో నిలిపి కవరింగ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి — గతంలో పేకాట క్లబ్బులు నిర్వహించినట్లు చెప్పబడుతున్న క్లబ్ యజమాని — ఈ అక్రమ ఇసుక రవాణాకు మద్దతు ఇస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. “మాకు ఎవరూ ఏమీ చేయలేరు” అన్న ధీమాతో మాఫియా వ్యవహరిస్తోందని ప్రజలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సాలూర మండలం మీదుగా నిజంగా రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందా లేదా అన్న విషయాన్ని సంబంధిత శాఖల అధికారులు దర్యాప్తు చేసి సత్యాసత్యాలను నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







