.
: ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు.
సాలూర : రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు బాధ్యతగా పాటించాలని బోధన్ రూరల్ పోలీసులు పేర్కొన్నారు.అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాలూర మండల కేంద్రం శివారులోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ప్రాంతంలో బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమ నిబంధనల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించి వాహనానికి సంబంధించిన పత్రాలను వెంబడి ఉంచుకోవాలని సూచించారు.అదేవిధంగా ఫోర్ వీలర్ వాహనాలపై ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వలన ప్రాణాపాయాలు ఉండవన్నారు.భారీ వాహనాలు నడిపించేవారు సైతం రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రయాణం సాగించాలని వెల్లడించారు. ముత్యం సేవించి వాహనాలను నడపరాలని సూచించారు.మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు.లేనిపక్షంలో చట్టపరమైన చర్యలతో పాటు జరిమాణాలు జైలు శిక్ష తప్పదు అన్నారు.ఈ కార్యక్రమంలో బోధన్ రూరల్ పోలీసులు ప్రయాణికులు తదితరులు ఉన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







