Breaking News

V1News Telangana

best news portal development company in india

కార్పొరేట్ లకు దాసోహమైన మోడీ ప్రభుత్వం* *భైంసాలో సార్వత్రిక సమ్మె*

SHARE:

 

కార్మిక, రైతు, ప్రజలను కార్పొరేట్ లకు దోచిపెట్టడం మానుకోవాలని *అఖిల భారత రైతు కూలీ సంఘం(aikms) రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.రాజు,, టి యు సి ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏం బక్కన్న రామ్ లక్ష్మణ్ ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఎం హరిత ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు ఇప్ప లక్ష్మణ్* లు హెచ్చరించారు. గురువారం సంయుక్త కిసాన్ మోర్చా, సి టి యు ల ఆధ్వర్యంలో భైంసా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన సార్వత్రిక సమ్మె సభలో వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేకంగా చట్టాలు రూపొందిస్తున్నదని అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తెస్తున్నదని విమర్శించారు కార్మికుల జీతభత్యాలు తక్కువగా ఉండి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితిలో కోడ్ ల రూపంలో దోపిడీ పెంచుతున్నారని విమర్శించారు వ్యవసాయ రంగాన్ని వ్యాపారాన్ని కార్పోరేట్ కంపెనీలకు అప్పచెప్పే కుట్రలో భాగంగా విత్తన చట్టం విద్యుత్ చట్టం తెస్తున్నదని అన్నారు అమెరికా తో చేసుకున్న ఒప్పందాలు భారత చిన్న సన్న కారు రైతాంగ వెన్ను విరుస్తాయని ఇది మోడీ తన ఫ్రెండు అయినా ట్రంప్ కు ఇస్తున్న బహుమతి అని విమర్శించారు వ్యవసాయ వాణిజ్యాన్ని బహుళ జాతి కంపెనీలకు ప్రవేశం కల్పిస్తూ రైతులను వ్యాపారులకు బలి పశువులుగా మారుస్తున్నారని అన్నారు కార్మిక కర్షక లోకం ఏకమై మోడీ ప్రభుత్వం పై పోరాటాన్ని కొనసాగిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు మహేందర్ మద్దతు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐ కేఎంఎస్ జిల్లా నాయకులు గంగాధర్ దీనాజీ ఏఐకేఎస్ నాయకులు ము త్తన్న,tuci నాయకులు గోదావరి, ఏఐటీయూసీ నాయకులు కార్మికులు దేవిదాస్, రాములు, శంకర్, అనురాధ, నరేష్, నరేందర్, మధుకర్, గంగాధర్, రమేష్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.
*జె రాజు*
*Aikms రాష్ట్ర ఉపాధ్యక్షులు*

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india
best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई