V1News Telangana

best news portal development company in india

దొరల పాలనకు దూరం చేశారు ప్రజా పాలనకు స్వాగతించారు

SHARE:

రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు..

నిజామాబాద్
గత పది సంవత్సరాల్లో దొరల పాలన కొనసాగిందని ,నియంత పాలన కొనసాగిందని, ప్రజల వ్యతిరేక పాలన కొనసాగడంతో ప్రజలు గట్టి తీర్పు ఇచ్చి , ప్రజా పాలన కు స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మంచి తీర్పు ఇవ్వడం చాలా గర్వకారమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నిజామాబాద్ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం,ఎ వహీద్ భాయ్. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మీడియాతో ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించి అత్యధిక సీట్లను కైవసం చేసుకోవడంలో ప్రజలు మంచి తీర్పు ఇవ్వడం చాలా గర్వకారణం అని ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు ఆయన తెలియజేశారు. ప్రజలు రెండోసారి కూడా సర్పంచ్ ఎన్నికల్లో మంచి తీర్పు ఇవ్వడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముందు ఉండడం అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు న్యాయం చేస్తున్న వైనం పై రాష్ట్ర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసి సర్పంచు ఎన్నికల్లో మంచి తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అదే విధంగా విద్యుత్తు సరఫరా ఫ్రీ ఇవ్వడం, రైతు రుణమాఫీ, రైతు పండించిన ఒక కింట ధాన్యంకు 500 రూపాయల బోనస్ , ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అందుకే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రజలు కొనేయాడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇదే కోణంలో ప్రస్తుతం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించడానికి ముందు ఉన్నారని కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తున్నారని అన్నారు, బాన్సువాడ నియోజకవర్గం లో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు బాన్సువాడ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడంలో ఆయన చేస్తున్న అద్భుత సేవలను ప్రజలు గుర్తించి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ను అభివృద్ధి పనుల పట్ల వెచ్చించి ప్రజలకు ఆమోదయోగ్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సేవలను గుర్తించి మళ్లీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించడంలో ప్రజలు రంగం సిద్ధం చేసుకున్నారని అన్నారు.

పోలీసు వ్యవస్థ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తమ తీరును మార్చుకోండి

తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతల పర్యవేక్షణలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు అంటే పోలీసు వ్యవస్థ సేవలు అద్భుతం అని ఎం ఏ వహీద్ భాయ్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో సిపి సజ్జనార్తోపాటు సిపి గౌసుద్దీన్, టోటల్గా పోలీసు వ్యవస్థ మంచి సేవలు అందిస్తూ ఉంటే, అదేవిధంగా ఆర్మూర్లో సైతం పోలీసులు ప్రజల పట్ల మంచి సేవలు అందిస్తూ ఉన్న తరుణంలో వారిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రేట్లు దురుసుగా మాట్లాడడం చాలా దారుణమని వెంటనే వారి తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుందని ఆయన హెచ్చరికలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని వారి పట్ల దురుసుగా వ్యవహరించడం సిగ్గుచేటని వెంటనే వారి తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో గుణపాఠం చెప్పడంలో తాము వెనుకంజ వేయబోమని ఆయన హెచ్చరికలు చేశారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india