V1News Telangana

best news portal development company in india

ఎన్నికల్లో మోసపూరిత హామీలు, మోసం చేసి ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి గెలిచారు

SHARE:

తెలంగాణ రాష్ట్రంలో ఇసుక దందా లో నెంబర్ వన్ స్థానంలో ఎమ్మెల్యే సుదర్శరెడ్డి ఉన్నారు

ఎన్నికల్లో మోసపూరిత హామీలు, మోసం చేసి ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి గెలిచారు

రెండున్నర సంవత్సరంలో బోధన్ పట్నంలో చేసిన అభివృద్ధి ఏమిటి
బోధన్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏడ ఉంది చూపియండి

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కార్యకర్తలకు విలువయ్యడు
మహిళలకు ఏమేవే అని పిలవడం సమాజసమా

నాగంపల్లి నరేందర్ రెడ్డి ఏడు కోట్లు సంపాదించాడు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరుతో ఇసుకలో చీటీలు చింపుతూ

ఇసుకమఫియాలో గంగా శంకర్, నాగేందర్, నగేందర్ రెడ్డి తో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు

బోధన్ నియోజకవర్గంలో బోధన్ పట్టణంలో నిజాంబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలిపించి మీటింగ్ పెట్టడం ఏమిటి

బోధన్

తెలంగాణ రాష్ట్రంలోని ఇసుక మాఫియా లో నెంబర్ వన్ స్థానంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిలవడం చాలా హాస్యస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అన్నారు, నిజాంబాద్ జిల్లా బోధన్ పట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బోధన్ పట్టణంలో 38 వార్డులు ఉన్నాయని, బోధన్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన 60 వేల మంది సైనికులు ఉన్నారని తెలిపారు, 38 వార్డులో 38 మందిని టిఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. గత ఎమ్మెల్యే ఎలక్షన్లో మోసం చేసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గెలవడం జరిగిందని మళ్లీ తప్పిదం చేయకుండా టిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన కౌన్సిలర్ కు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రెండున్నర సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని రెండున్నర సంవత్సరంలో బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ పట్నానికి బోధన్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని అభివృద్ధి శూన్యమని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులను చూపుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్బం కడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అసలు సైనికులు లేరని కార్యకర్తలు లేరని బిఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన వారే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకుల పై భయభ్రాంతులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేస్తున్నారని అన్నారు , కాంగ్రెస్ పార్టీలోకి రావాలని బెదిరింపులు చేస్తున్నారని ,అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రతి మీటింగ్ లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజాంబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొచ్చి మీటింగ్ పెట్టడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నిజాంబాద్ నుంచి కార్యకర్తలు తీసుకొచ్చి మీటింగ్ పెట్టడం అంటే బోధన్ పట్టణంలో, నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు విలువ ఇవ్వకపోవడమే అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కార్యకర్తలకు అస్సలు విలువ ఇవ్వ బోరు అని అన్నారు. మహిళలకు ఏం వే అని పిలవడం ఎంతవరకు సమంజసం అని మహిళలకు గౌరవం ఇవ్వని ఇలాంటి ఎమ్మెల్యే కు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇసుక మాఫియాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండడం సిగ్గుచేటని మండిపడ్డారు. నాగంపల్లి కి చెందిన నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరుతో చీటీలు చింపి ఇసుక మాఫియాలు ఏడు కోట్లు సంపాదించడం జరిగిందని అన్నారు గతంలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో ఖర్చు పెడతారు అని చెప్పి మోచేతికి బెల్లం పెట్టడం జరిగిందని ఎద్దేవా చేశారు, ఎవరైనా పనుల కోసం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వద్దకు వెళ్తే ఎలక్షన్లో గెలుపు కోసం 40 కోట్లు ఖర్చు పెట్టానని ఎగతాళి చేసి మాట్లాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాలు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇప్పటివరకు 40 కోట్ల రూపాయలు సంపాదించడం జరిగిందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తాము అహర్నిశలు కృషి చేస్తామని, ప్రజల పక్షాన ఉద్యమిస్తామని అందుకే టిఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్లను గెలిపించాలని ఆయన అన్నారు. ఇసుక మాఫియాలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి గంగా శంకర్ ,నాగేందర్ , నాగేందర్ రెడ్డి తో పాటు కొంతమంది సహకరించి ఇసుక మాఫియాలో రాటుదేలారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది గుంట నక్కలే కాంగ్రెస్ పార్టీలోకి పోయారని అలాంటి నమ్మకద్రోహులు టిఆర్ఎస్ పార్టీ నుంచి పోయి చాలా మంచిగా చేశారని అలాంటి వారు ఎప్పటికైనా ద్రోహులే అని అన్నారు. ఇసుక మాఫియా రోజురోజుకు పెరుగుతుందని వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. మంజీరా నదులను గోదావరి నదులను భ్రష్టు పట్టిస్తున్నారని ఇసుక మాఫియాకు తెరలేపుతున్నారని అన్నారు. కళ్ళు ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే అవినీతి అక్రమాలు జరుగుతుంటే ఇసుక మాఫియా జరుగుతుంటే, పేపర్ విలేకరులు, మీడియా సత్యం రాయడం లేదని అసత్యాల వైపు మొగ్గు చూపడం దారుణమని మీడియాపై మండిపడ్డారు. తమ తీరు మార్చుకొని ప్రజల పక్షాన వార్తలు రాసి అవినీతి అక్రమాలను బట్టబయలు చేయాలని ఎందుకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి భయపడుతున్నారా అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. నిజాన్ని, జరుగుతున్న అవినీతి ,అక్రమాలను నిర్భయంగా రాయాలని అన్నారు. కానీ విలేకరులు ఇలాంటివి చూపడం లేదని కొంతమంది విలేకరులు ఇసుక మాఫియా లో ఉన్నారని తమకు తెలుసని అన్నారు. తన యొక్క రైస్ మిల్ వద్ద ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చీటీలు చింపు తూ ఒక్కొక్క టిప్పర్లు 8 బకెట్లు ఒక్కొక్క బకెట్ కు 2000 రూపాయల చొప్పున సుమారు 16 వేల రూపాయలు తీసుకుంటున్నారని, రే బిల్లులకు నాలుగువేల రూపాయలు అని మొత్తం 20 వేల రూపాయలు అవుతుందని, 16 వేల రూపాయలు ఎమ్మెల్యేకు వాటా ఏ సి పి కి, సిఐ కి వాటా పోలీసులకు వాటా ఇంకా ఇతర అధికారులకు వాటాలు ఉన్నాయని అన్నారు. మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బలపరిచిన వారికి ఓట్లు వేస్తే మళ్లీ రెండోసారి మోసం జరుగుతుందని, కావున బోధన్ పట్టణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india