బోధన్ మున్సిపాలిటీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, న్యాయవాది వెంకటేశ్వర్ దేశాయ్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. 26-01-2026 సోమవారం రోజున నిజామాబాద్‌లోని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో, ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఆయన అధికారికంగా కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడనై పార్టీ మారుతున్నట్లు వెంకటేశ్వర్ దేశాయ్ ప్రకటించారు. ప్రజల కోసం పనిచేసే శక్తివంతమైన వేదిక కాంగ్రెస్ పార్టీయేనని విశ్వసించి చేరినట్లు స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా తనవంతు పోరాటం చేస్తానని గర్జించారు.
వెంకటేశ్వర్ దేశాయ్‌కు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి, సీనియర్ నాయకులు అరికెల నర్సారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ చేరికతో బోధన్ మున్సిపాలిటీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని, బీఆర్‌ఎస్‌కు ఇది భారీ ఎదురుదెబ్బగా మారిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఈ ఒక్క చేరికతోనే బోధన్ రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని, రానున్న రోజుల్లో మరిన్ని కీలక చేరికలు జరిగే అవకాశం ఉందని, రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని స్పష్టమవుతోంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








