V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మిత మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ ప్రారంభం నేడు

SHARE:

బోధన్, జనవరి 25:
బోధన్ పట్టణంలోని పాండు ఫారంలో నిర్మించిన మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్‌ను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, శాసనసభ్యులు పి. సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సుమారు రూ.20 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో ఈ నూతన భవనాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ పాఠశాల ద్వారా నియోజకవర్గంలోని పేద మరియు ప్రతిభావంతులైన మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ తూము శరత్ రెడ్డి, ఎల్లం ఆదినారాయణ, హరికాంత్ చారి, గుండేటి రాములు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india