చందూరు, మోస్రా, బోధన్‌లో అర్హతలేని వైద్యుల అడ్డాగా మారిన ఆసుపత్రులు – ప్రజల ప్రాణాలతో చెలగాటం, వేలల్లో వసూళ్లు..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అర్హతలేని వైద్యులు ఆసుపత్రుల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే, జిల్లా వైద్య శాఖ ఒక్క ఆసుపత్రిపైనే చర్యలు తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. బోధన్ పట్టణంలో ఇటీవల ఒక ఆసుపత్రిపై మాత్రమే చర్యలు తీసుకోవడం సరిపోతుందా? మిగతా 29 ఆసుపత్రులు కనిపించడంలేదా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
డాక్టర్ డీఎంఅండ్‌హెచ్‌ఓ రాజశ్రీ మేడం అర్హతలేని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటూ జిల్లా చరిత్రలోనే అరుదైన సాహసం చేశారని ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. రాజకీయ ఒత్తిడులు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకోవడం జిల్లాకే గర్వకారణమని కొనియాడుతున్నారు. అయితే అదే సమయంలో ప్రజలు ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా మేడం దృష్టికి తీసుకువస్తున్నారు.
“ఒక్క ఆసుపత్రిపై చర్యలు సరిపోవు… బోధన్‌లో ఇంకా 29 ఆసుపత్రులు ఉన్నాయి, అక్కడ జరుగుతున్న అక్రమాలు కనిపించవా?” అని ప్రశ్నిస్తున్నారు.

బోధన్ పట్టణంలో అనేక ఆసుపత్రుల్లో అర్హతలేని వైద్యులు ఇష్టానుసారంగా
గ్లూకోజ్ బాటిళ్లు ఎక్కించడం,
ఇంజక్షన్లు ఇవ్వడం,
బెడ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం,
ఇతరుల సర్టిఫికెట్లు కొనుగోలు చేసి వైద్యం చేయడం,
అధిక రేట్లకు మందులు విక్రయించడం,
హైడోస్ మందులతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడటం
వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇవి కేవలం డబ్బుల దోపిడీ మాత్రమే కాదు… నేరుగా ప్రజల ప్రాణాలపై దాడి చేసే చర్యలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చందూరు మండలంలో కూడా ఇదే పరిస్థితి. ఒక ఆసుపత్రిపై చర్యలు తీసుకుని మిగతా ఆసుపత్రులను వదిలేయడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడ “బుడ్డి, మండి, ఫిస్టులా” వంటి ఆపరేషన్ల పేరుతో రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేస్తూ, అర్హత లేకుండానే శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది బహిరంగ రహస్యంగానే మారిందని ప్రజలు అంటున్నారు.
మోస్రా మండల కేంద్రంలో బస్టాండ్ పక్కనే అర్హతలేని వైద్యులు ఆసుపత్రులు నిర్వహిస్తూ
సెలైన్లు ఎక్కించడం,
హైడోస్ మందులు ఇవ్వడం,
ఎండీ, ఎంఎస్ స్థాయి వైద్యం చేస్తున్నట్టు ప్రచారం చేయడం
వంటివి చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్ అంటూ భయపెట్టి వేలల్లో బిల్లులు వేసి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రజల ప్రశ్న స్పష్టంగా ఉంది:
“ఒక్క ఆసుపత్రిపై చర్యలు తీసుకుని శభాష్ అనిపించుకుంటే సరిపోతుందా?
బోధన్‌లో ఉన్న మిగతా 29 ఆసుపత్రులు, చందూరు, మోస్రా మండలాల్లోని అక్రమ ఆసుపత్రులపై ఎప్పుడు చర్యలు?”
డాక్టర్ రాజశ్రీ మేడం, అలాగే ఉప వైద్యాధికారి డాక్టర్ సమత గారికి ప్రజలు విన్నపం చేస్తున్నారు.
మీరు మొదలుపెట్టిన ఈ చారిత్రాత్మక చర్యలు అర్ధాంతరంగా ఆగిపోవద్దు.
ఒక్కరిద్దరిని పట్టుకుని వదిలేస్తే, మిగతావారు మరింత ధైర్యంగా అక్రమాలకు పాల్పడతారు.
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి,
బోధన్‌లో ఒక్క ఆసుపత్రికే చర్యలా..? మిగతా 29 ఆసుపత్రులు కనబడట్లేదా?
అర్హత లేని వైద్యుల దోపిడీకి జిల్లా వైద్య శాఖ ఎందుకు అడ్డుకట్ట వేయడం లేదు
చందూరు, మోస్రా, బోధన్‌లో అర్హతలేని వైద్యుల అడ్డాగా మారిన ఆసుపత్రులు – ప్రజల ప్రాణాలతో చెలగాటం, వేలల్లో వసూళ్లు
వార్త :
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అర్హతలేని వైద్యులు ఆసుపత్రుల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే, జిల్లా వైద్య శాఖ ఒక్క ఆసుపత్రిపైనే చర్యలు తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. బోధన్ పట్టణంలో ఇటీవల ఒక ఆసుపత్రిపై మాత్రమే చర్యలు తీసుకోవడం సరిపోతుందా? మిగతా 29 ఆసుపత్రులు కనిపించడంలేదా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
డాక్టర్ డీఎంఅండ్‌హెచ్‌ఓ రాజశ్రీ మేడం అర్హతలేని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటూ జిల్లా చరిత్రలోనే అరుదైన సాహసం చేశారని ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. రాజకీయ ఒత్తిడులు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకోవడం జిల్లాకే గర్వకారణమని కొనియాడుతున్నారు. అయితే అదే సమయంలో ప్రజలు ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా మేడం దృష్టికి తీసుకువస్తున్నారు.
“ఒక్క ఆసుపత్రిపై చర్యలు సరిపోవు… బోధన్‌లో ఇంకా 29 ఆసుపత్రులు ఉన్నాయి, అక్కడ జరుగుతున్న అక్రమాలు కనిపించవా?” అని ప్రశ్నిస్తున్నారు.
బోధన్ పట్టణంలో అనేక ఆసుపత్రుల్లో అర్హతలేని వైద్యులు ఇష్టానుసారంగా
- గ్లూకోజ్ బాటిళ్లు ఎక్కించడం,
- ఇంజక్షన్లు ఇవ్వడం,
- బెడ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం,
- ఇతరుల సర్టిఫికెట్లు కొనుగోలు చేసి వైద్యం చేయడం,
- అధిక రేట్లకు మందులు విక్రయించడం,
- హైడోస్ మందులతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడటం
వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇవి కేవలం డబ్బుల దోపిడీ మాత్రమే కాదు… నేరుగా ప్రజల ప్రాణాలపై దాడి చేసే చర్యలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చందూరు మండలంలో కూడా ఇదే పరిస్థితి. ఒక ఆసుపత్రిపై చర్యలు తీసుకుని మిగతా ఆసుపత్రులను వదిలేయడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడ “బుడ్డి, మండి, ఫిస్టులా” వంటి ఆపరేషన్ల పేరుతో రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేస్తూ, అర్హత లేకుండానే శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది బహిరంగ రహస్యంగానే మారిందని ప్రజలు అంటున్నారు.
మోస్రా మండల కేంద్రంలో బస్టాండ్ పక్కనే అర్హతలేని వైద్యులు ఆసుపత్రులు నిర్వహిస్తూ,
- సెలైన్లు ఎక్కించడం,
- హైడోస్ మందులు ఇవ్వడం,
- ఎండీ, ఎంఎస్ స్థాయి వైద్యం చేస్తున్నట్టు ప్రచారం చేయడం
వంటివి చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్ అంటూ భయపెట్టి వేలల్లో బిల్లులు వేసి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రజల ప్రశ్న స్పష్టంగా ఉంది:
“ఒక్క ఆసుపత్రిపై చర్యలు తీసుకుని శభాష్ అనిపించుకుంటే సరిపోతుందా?
బోధన్‌లో ఉన్న మిగతా 29 ఆసుపత్రులు, చందూరు, మోస్రా మండలాల్లోని అక్రమ ఆసుపత్రులపై ఎప్పుడు చర్యలు?”
డాక్టర్ రాజశ్రీ మేడం, అలాగే ఉప వైద్యాధికారి డాక్టర్ సమత గారికి ప్రజలు విన్నపం చేస్తున్నారు.
మీరు మొదలుపెట్టిన ఈ చారిత్రాత్మక చర్యలు అర్ధాంతరంగా ఆగిపోవద్దు.
ఒక్కరిద్దరిని పట్టుకుని వదిలేస్తే, మిగతావారు మరింత ధైర్యంగా అక్రమాలకు పాల్పడతారు.
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి,
-
అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు,
-
క్లినిక్స్,
-
నర్సింగ్ హోమ్స్
పై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కేవలం వైద్య శాఖ చర్యల విషయం కాదు…
ఇది ప్రజల ప్రాణాల భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశం.
ఉమ్మడి జిల్లాల్లో ఇలాంటి అర్హతలేని వైద్యులు, అక్రమ ఆసుపత్రులపై జరుగుతున్న అక్రమాలను ప్రజల తరఫున మీడియా రూపంలో నిరంతరం వెలుగులోకి తీసుకువస్తామని స్పష్టం చేస్తున్నారు.
ఇప్పుడు ప్రజలు ఎదురుచూస్తున్నది ఒక్కటే:
“ఒక్క ఆసుపత్రిపై కాదు… అన్ని అక్రమ ఆసుపత్రులపై ఒకేసారి కొరడా ఝుళిపించాలి.”
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....