రాజన్న రాజ్యంలో పోచమ్మ మైదానంలో అక్రమ కట్టడాలు కూల్చివేత నడిరోడ్డు పైకి సామాన్లతో పేద మధ్యతరగతి వ్యాపారస్తులు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం ఆగస్టు 19:-
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గతంలో ఉన్న పోచమ్మ మైదానంలో కట్టిన అక్రమ కట్టడాలను రాజన్న ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతున్నాయి మొన్నటిదాకా ఉన్న వ్యాపారస్తులు రోడ్లపైకి సామాన్లతో వచ్చారు కూల్చివేత మంచ చెడ దేవుడు ఏరుగు మధ్యతరగతి వ్యాపారస్తుల పరిస్థితి అయోమయంగా మారిందాని తలలు బాదుకుంటున్న వైన్యం రోజు రోజుకు మారుతున్న పోచమ్మ మైదానం సంఘటన అక్రమ కట్టడాలు కూల్చివేత మంచిదే కానీ అందులో ఉన్న పేద మధ్య తరగతి కుటుంబ వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి అని ముక్కున వేలుసుకుంటున్న ప్రజానికం గతంలో గత ప్రభుత్వాలు కట్టినటువంటి రామగుండం మున్సిపల్ సముదాయ బిల్డింగును వాడకుండా ఎన్నో ఏళ్లగా నిరుపయోగంగా ఉన్న రూములను అక్కడున్న వ్యాపారస్తుల కేటాయించి తరువాత అక్రమ కట్టడాలను కూల్చివేతలు జరిపితే మధ్యతరగతి వ్యాపారస్తులకు నాయం జరిగేది కానీ ఇలాంటి దారి చూపకుండా ఇలా నడిరోడ్డుపై వదిలేయడం సరైన పద్ధతి కాదని వ్యాపారస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి రోజు వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకు మధ్య తరగతి కుటుంబాలకు ఆసరాగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.
Author: NAMANI RAKESH
STAFF REPORTER RAMAGUNDAM








