Post Views: 124
రైతుల ఆందోళన – వరి, మక్క, పత్తి పంటలు నీట మునకలో నష్టపరిస్థితి….
వర్షాల దెబ్బకు శివారు పంట పొలాలు మునిగిపోవడంతో రైతులకు కష్టాలు…
. పంట నష్టాన్ని అంచనా వేసి సహాయం అందించాలంటూ రైతుల విజ్ఞప్తి.
నిజామాబాద్, ఆగస్టు 19:
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు రూపం దాల్చి రైతులపై విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా సాలూర మండల పరిధిలోని మంజీరా పరివాహక గ్రామాలైన ఖాజాపూర్, హుంసా, మందర్న శివారు ప్రాంతాల్లోని పంట పొలాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
కొత్తగా వేసిన వరి, మక్క, పత్తి పంటలు నీటిలో కూరుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల మీద వేసిన పంటలు వరదలతో నష్టపోతాయేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది.
“ఇప్పటికే విత్తనాలు, ఎరువుల కోసం అప్పులు చేశాం. ఇప్పుడు పంటలే మునిగిపోతే మేము ఎలా బ్రతుకుతాం?” అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు వెంటనే గ్రామాలను సందర్శించి, పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









