– “తల్లిపాల వారోత్సవాలు”.. ముర్రుపాల ప్రాముఖ్యతపై మాతృమూర్తులకు అవగాహన
– రోగ నిరోధక శక్తిని పెంచి భవిష్యత్తులో పిల్లలను సంరక్షిస్తాయని వివరణ
– గర్భిణీ స్త్రీలు, బాలింతలు మెరుగైన ఆహార నియమాలు పాటించాలని పలు సూచనలు
– ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల అంగన్వాడి సెంటర్ – 1 యందు శనివారం రోజు ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి ఆధ్వర్యంలో “తల్లిపాల వారోత్సవాలు”కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలో గల బాలింతలు, గర్భిణీ స్త్రీలు, అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి మాట్లాడుతూ తల్లిపాల విశిష్టత ,ప్రధానంగా ముర్రు పాల ప్రాముఖ్యతపై మాతృమూర్తులకు క్లుప్తంగా అవగాహన కల్పించారు .. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు మెరుగైన ఆహార నియమాలు పాటించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు పౌష్టికరమైన, అధిక పోషకాలు లభ్యమయ్యే ఆహార పదార్థాలను స్వీకరించాలని తెలిపారు. తద్వారా పుట్టబోయే బిడ్డలకు తల్లిపాలు పుష్కలంగా అందుతాయని సూచించారు. ముఖ్యంగా ప్రసవానంతరం తల్లులు తమ బిడ్డలకు మొదటి కొన్ని రోజులు తల్లి నుండి వచ్చే పాలను త్రాగించడం ముఖ్యమైన విషయమని అన్నారు. ముర్రు పాలు రోగ నిరోధక శక్తిని పెంచి, అనేక వ్యాధుల నుండి బిడ్డను కాపాడతాయని.. అలాగే, జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఆరోగ్యంగా ఉండే విధంగా దోహదపడతాయని తెలిపారు. ముర్రుపాలలో ఉండే పోషకాలు, యాంటీబాడీ లు శిశువు యొక్క రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. మరియు భవిష్యత్తులో సంక్రమించే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల భారి నుండి రక్షణ కల్పిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అంగన్వాడి టీచర్ గౌరమ్మ, ఆశా వర్కర్ కవిత తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








