V1News Telangana

best news portal development company in india

రైతులందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలి….

SHARE:

 

 

– పీఎం కిసాన్ 20వ విడత ఆర్థిక సహాయం నిధులు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

 

– బిజెపి ప్రభుత్వం రైతులను, అన్ని రంగాల ప్రజల అభివృద్ధికి పాటుపడుతుందని వర్ణన

 

– రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి

 

– బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ

 

రుద్రూర్ ప్రతినిధి:

 

నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల కేంద్రంలో గల రైతు వేదికలో శనివారం రోజు AO సాయి కృష్ణ, AEO వెంకటేష్ గారి ఆధ్వర్యంలో రైతులు, బిజెపి నాయకులు ,గ్రామస్తుల సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మరియు కార్యకర్తలు అందరూ కలిసి హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రోజు వారణాసిలో పీఎం కిసాన్ 20 వ విడత రైతులకు ఆర్థిక సహాయం నిధులు విడుదల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందరూ శ్రద్ధగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని వర్గాల అభ్యున్నతి కొరకు కృషి చేస్తుందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు దేశానికి వెన్నుముక అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు దాదాపు 20 రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ ది అని తెలిపారు. రైతులందరూ పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దని.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని లబ్ధి పొందాలని సూచించారు. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగే విషయాలపట్ల జాగ్రత్త వహిస్తూ రైతులకు భీమా సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు. అనంతరం మిర్జాపూర్ క్లస్టర్ లో బదిలీపై విచ్చేసి నూతనంగా విధులు నిర్వహిస్తున్న AEO గ్రీష్మ ను బిజెపి నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా రైతు వేదిక ప్రాంగణంలో పూల మొక్కలను కూడా నాటారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్, ఉపాధ్యక్షులు బేగరి వినోద్ కుమార్, భోజిగొండ అనిల్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు ఓదెల సతీష్ పవార్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బేగరి శివప్రసాద్, మండల కార్యదర్శి ఈరోళ్ల శంకర్, బేగరి సాయికుమార్, నెమ్లి గంగాధర్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india