V1News Telangana

best news portal development company in india

పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు….

SHARE:

 

 

నసురుల్లా బాద్ ప్రతినిధి:

 

నసురుల్లాబాద్( బాన్సువాడ): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని BLN గార్డెన్స్ లో శుక్రవారం రోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకులుగా విధులు నిర్వహించిన లక్ష్మారెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి నసురుల్లాబాద్ మండల నాయకులు హాజరయ్యారు. అనంతరం లక్ష్మారెడ్డి దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల, మాజీ ఏఎంసీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, మాజీ ఎంపీపీ పాల్త్య విట్టల్, మాజీ జెడ్పిటిసి జన్ను బాయ్ ప్రతాప్ సింగ్, మాజీ జిల్లా కోఆప్షన్ మెంబర్ మాజీద్, మాజీ సర్పంచ్ రాము, చుంచు సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india