V1 న్యూస్.హైదరాబాద్, జూలై 15:-
నాబార్డ్ 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని రీజనల్ ఆఫీస్ వేదికగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా సాలూర సహకార సంఘం కు అరుదైన గౌరవం లభించింది. ఉత్తమ సహకార సంఘంగా గుర్తింపుపొందిన ఈ సంఘాన్ని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు శాలువా కప్పి, మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి శ్రీ బి. బస్వంత్ రావు గారు సంఘం తరపున ఈ సన్మానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ, ఈ గౌరవం సంఘ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేసిన పాలకవర్గ సభ్యులు, రైతులు మరియు సిబ్బంది అంకితభావానికి ఫలితమని పేర్కొన్నారు. అదే సమయంలో సంఘాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు మార్గనిర్దేశం చేసిన నాబార్డ్ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ అవార్డు ద్వారా జిల్లాలోని ఇతర సహకార సంఘాలకు ఆదర్శంగా నిలిచేలా సాలూర సంఘం పేరుపొందింది.
నాబార్డ్ ఉత్తమ సహకార సంఘంగా సాలూర ఎంపిక – మంత్రి తుమ్మల చేతుల మీదుగా సన్మానం

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....