V1News Telangana

best news portal development company in india

తీన్మార్ మల్లన్న – కవిత వివాదం భీభత్సంగా మారింది!

SHARE:

జాగృతి కార్యకర్తలపై మల్లన్న గన్‌మెన్ దాడి – తుపాకీతో బెదిరింపు, తీవ్ర గాయాలు.
బీసీ రిజర్వేషన్ వివాదం.. మల్లన్న vs కవిత ఘర్షణ ఉద్రిక్తంగా!”
“హైదరాబాద్‌లో రాజకీయ హింస.. తీన్మార్ మల్లన్న ఆఫీసు వద్ద తుపాకీ మోత!”
“మంచం-కంచం వ్యాఖ్యల తూటాలు.. రక్తపాతానికి దారి!”

వి1 న్యూస్, హైదరాబాద్:
బీసీ రిజర్వేషన్ అంశం రాజకీయ వేదికగా మారిన వేళ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను విమర్శించిన తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు తీవ్ర పరిణామాలకు దారి తీసాయి. ఆదివారం మేడిపల్లిలో మల్లన్న కార్యాలయం వద్ద ఘర్షణ ఉద్రిక్తంగా మారింది.

జాగృతి కార్యకర్తలు మల్లన్నను వ్యతిరేకిస్తూ ఆఫీసుపై దాడి చేయడానికి యత్నించారు. ఆఫీసులోకి చొచ్చుకుపోయి ఫర్నిచర్ ధ్వంసం చేసే ప్రయత్నం చేయగా, అక్కడి సిబ్బంది, మల్లన్న గన్‌మెన్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తుపాకీతో బెదిరించడమే కాకుండా జాగృతి కార్యకర్తలపై పిడిగుద్దులు కూడా కురిపించారు. ఈ ఘటనలో ఒకరిద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.

ఆఫీసు లోపల రక్తపు మడుగులు కండించడమే కాకుండా, గాయపడిన వారి నుంచి కారిన రక్తం తడిచిన దృశ్యాలు అక్కడున్న వారిని కుదిపేశాయి. ఘర్షణ నేపథ్యంలో పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ఇక మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో స్పందించబోతుందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఇప్పటికే పార్టీకి దూరంగా ఉన్న మల్లన్నకు ఈ ఘటనతో మరింత ఒత్తిడి ఎదురవనుంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india