– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావ్ కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
– ఈటెల రాజేందర్ స్వగృహంలో సమావేశం
– భవిష్యత్ కార్యాచరణ పై సమాలోచనలు
– క్షేత్రస్థాయిలో పార్టీబలోపేతానికి మరింత కృషి చేస్తామని ప్రతిజ్ఞ
– బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా మరియు బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం రోజు హైదరాబాద్ లో గల బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా నియమితులైన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను అదేవిధంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పైడి ఎల్లారెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు భవిష్యత్తులో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి నాయకులకు, కార్యకర్తలకు తగు సూచనలు వివరించి, దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రాబల్యాన్ని మరింత మెరుగుపరిచి ఎక్కువ స్థానాల్లో గెలుపొంది సత్తా చాటుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు సున్నం సాయిలు, ప్రశాంత్ గౌడ్, ఇల్తెం శంకర్ , వివిధ ఆరు మండలాల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








