Post Views: 111
V1 న్యూస్, జూలై 10, బోధన్ : రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్ మాసంలో నిర్వహించిన కుల గణన కుటుంబ సర్వేలో భాగంగా కుటుంబ వివరాలను ఆన్లైన్ నమోదు చేసిన ప్రైవేట్ ఆపరేటర్లకు డబ్బులు ఇప్పించాలని బోధన్, సాలూర మండలానికి చెందిన ఆపరేటర్లు గురువారం ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం అందించారు. ఒక్క కుటుంబానికి ఆన్లైన్ లో డేటాను నమోదు చేసినందుకు 30 రూపాయలు చొప్పున తమకు ఒక్కొక్కరికి సుమారు 10 నుంచి 20 వేల రూపాయల వరకు రావాల్సి ఉందని ఇట్టి డబ్బులు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








