Post Views: 135
బోధన్, జూలై 7:బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలి కాలంలో పోగొట్టుకున్న నలుగురు పౌరుల మొబైల్ ఫోన్లు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి రికవరీ చేసిన పోలీసులు వాటిని ఈ రోజు (07-07-2025) బాధితులకు అప్పగించారు.
ఈ కార్యక్రమం బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేయగా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) శ్రీ వెంకట నారాయణ గారి ఆధ్వర్యంలో బాధితులకు వారి మొబైల్ ఫోన్లు అందజేయడం జరిగింది. ప్రజల నమ్మకాన్ని పెంపొందించేందుకు బోధన్ పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయమని స్థానికులు అభిప్రాయపడ్డారు.
మొబైల్ పోయినప్పుడు CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయడం, పోలీసులు సాంకేతిక సహకారంతో ట్రేస్ చేయడం, యధావిధిగా యజమానులకు అప్పగించడం అనే విధానం పౌరుల మధ్య విశ్వాసాన్ని కలిగించిందని SHO వెంకట నారాయణ తెలిపారు.
బోధన్ పోలీసులు ప్రజల ఆస్తి రక్షణకు కట్టుబడి ఉన్నారని, ఎవరైనా మొబైల్ పోయినపుడు వెంటనే CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533